పుట:Garimellavyasalu019809mbp.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లీగునకు ప్రతి కక్షగా తమ సంఘ బలమును బలిష్టం చేసుకొనుటకై తాపత్రయము పడినారు. కాంగ్రెసు చెప్పుచున్న ఆశయమునకును మహాసభ ఆశయమునకును ఎట్టి భేరమును లేదు. అయితే కాంగ్రెస్ ఆచరించిన విదానమునకు మహాసభ విదానమునకును కృత్రిమ జాతీయతకు నిజమైన జాతీయతకు గల తేడా యున్నది. అయినా మహాసభను కులచర్య సంస్థయని కాంగ్రెస్ నిరసించుట కాంగ్రెస్ జాతీయతకే కళంకమైనది.

  ముస్లిము లీగర్లు మేము భారతీయులము కామని వాదించి బ్రిటిషు సహాయం వల్ల పాకిస్తానమును నిర్మించుకునివేరే కాపురం పెట్టుకున్నారు. మిగిలిన ముస్లిములకు ప్రత్యేక నియోజక వర్గాది కృత్రిమ సౌకర్యాలను తొలగించి భారత రాజ్యాంగ పరిషత్తువారు సాధారణ వోటర్ల అంతస్థుకు దించేశారు. మహసభ ఆశయమును ఇదియే  కనుక్ ది తన తొంటి కార్యక్రమ ప్రణాళికను కట్టిపెట్టి మత సంస్ధకు బదులు పౌరసంస్థలల్లో నొకటియై నిలచినది. 
     ముస్లిము లీగు పాకిస్థానముముల తుఫాను ఇప్పటికీ కొంత మాత్రమే చల్లారినది. ఏ క్షణములో  ఏరూపముగా ఎవరి సహయం వల్ల అది యెట్లు విజృంబించి భారత జాతీయతను నిలబెట్టి, హిందూ శిక్కు సంఘములపై దాడి తీయునో ఊహింపజాలము. భారతదేశ ప్రభుత్వమును అందలి సమస్త సంఘముల వారును ఇప్పటికంటే వేయిరెట్లు బలిష్టులై యీ యుప్పన నెదుర్కొన సంసిద్ధులై యుండవలెను.
-ఢంకా, మార్చి, 1948