పుట:Garimellavyasalu019809mbp.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గాంధీమహాత్ముని సూచనలను అతని మరణానంతరము కాంగ్రెస్సు కమిటీ ఆమోదించినది. కాంగ్రెస్సు కూడ త్వరలో ఆమోదించగలదు. కాంగ్రెస్సు బాద్యత ఇకముందు సర్వజన సమాన శ్రేయోదాయకములైన సమస్యలను గురించి విజ్ఙానము దీక్ష ప్రజలలో వర్ధిల్ల చేసి శాంత పౌరుష జీవనము జరుపుటకు సాధనములు కలిపించుటే గాంధీ సూచించిన"లోకసేవకి వరమా" లీ పనినే ఇక ముందు ప్రజల చేత చేయించగలవు కాంగ్రెస్ సబ్యత్వపు హొదాతో ప్రజానీకమున కింతకంటె యెక్కువ ప్రమేయం లేదు.

  అయితే సర్వులును కాంగ్రెస్ లో సభ్యులే గాక, దేశంలో  వొటరులై కూడా యున్నారు. వోటర్లుగా వారికి రాజకీయ బాద్యతలున్నవి. వివిధ రాజకీయ పక్షముల వారు తమ ప్రణాళికలను తత్వములను వారికి బోధ చేసి ఏకీకృతులుగా చేసుకొనగడంగుదురు.  వారికి యా విధముగా నవ్యమైన రజకీయ జ్ఞానం పట్టుబడును.  వారికే పక్షము ప్రణాళిక బాగా నచ్చితే, ఆ ప్రణాళిక అభ్యర్దులకు వారు వోటుల నత్యధికముగా నిత్తురు. ఆ పక్షం వారును తమ ప్రణాళీకలను నవ్య్హముగ నడుపుదురు.
  ఏ ప్రణాలికయైనా పనిచేయడం ప్రారంభీస్తేనేగాని దానిలోని లోటుపాటులు విసదం గావు. గెలిచిన పక్షం వారు సవ్యంగా పనిచేసి దేశశ్రేయస్సును కూర్చగలిగితే, తిరిగీ  యెన్నికలలో వారినే ప్రజలు బలపరుస్తారు లేకుంటే  అప్పుడింకొక పక్షము వారి ప్రణాళిక వోటర్లుకు మనోహరముగా కనిపించితే, ఆ పక్షమునకు వోటర్లు పట్టం కట్టుదురు.  ఈవిధంగా ప్రజాప్రభుత్వ విధానం సాదుగుచుండును.
 నిజంగా ఏ దేశంలోనైనా మత విషయము పైన రాజకీయ పక్షాల కెట్టి తావును లేదు. నిజమైన మతం వారెవ్వరూ అట్టి దురాశకు పోరు. బ్రితిషువాడి మహిమ వల్ల ముస్లిముల ఆవేశం వల్ల వారొక మతరాజకీయ పక్షమైనారు.  కంగ్రెస్ ఆపక్షం అంగీకరించి అది కోరిన వరముల ననింటినీ అర్పించుట ప్రారంభించినది.అందువల్ల సిసలైన జాతీయ్ పక్షమగు హిందువులపస అడుగంటి పోజొచ్చెను. మహా సభవారు దీనిని సహించలేక ముస్లిం
గరిమెళ్ళ వ్యాసాలు