Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సుప్రసిద్ధ కూతలుంద్వలెను. "మేము ఒక మాట చెప్పి మరియొక పని చెయ్యము. మేము భ్రమ పెట్టము" మేము సహకారమును చేతుము ఇది మానిజాయితీ" యని చెప్పుకొనుట సముచితవాదుల శంఖనాదమైయున్నది. ఇందులో సత్యములేదని మేమనజాలము జస్టిసు పక్షమువారి "ఉద్యోగములు- సహకారము"లో కూడ ఇంతకన్న ఎక్కువ సత్యమున్నది. వారికేకలలో నున్నదెల్లయు సత్యమే.

     కాని కేవలము ఇట్టి హస్వసత్యముపై దృష్టిని నిల్చుకొనువారు స్వరాజ్యవాదుల ఆదర్శా సత్యమును గుర్తెరుంగలేక వారిని దగాకోరులని చాటవలసిన నేరమునకు పాత్రులుకాక తప్పదు. దేని సత్యము దానిలోనే యున్నది.  దేశమందరును చేతిపోయినంత మాత్రమునగాని, సంతకములు పెట్టినంతమాత్రమునగాని ఒకటి మరియొకటి కంటె నెక్కువ సత్యవంత మైనదియు, దేశహితైక మైనదియు, కాబోదు. అయినను కాంగ్రెస్ లో సేవయిన స్కీము తిరిగీ ఆ కాంగ్రెస్సులో రద్దు కాబదు వరకును దేశీయులకును వోటర్ల కును అనుసరణీయము. కాంగ్రెసులో సంతకము పెట్టి ఆ పేరు మోచుకొన్నందువలన గలిగెడి లాభములను భుజింపగోరుచు గూడ ఆ సంస్థ్ల్ ఆజ్ఞలకు వ్యూతిరేకముగపనిచేయుట తత్సంస్థమును తన్మూలమున దేశీయపురోభివృద్ధికిని గూడ ద్రోహమొనర్చినట్లే- ఈ సమయమున సాధ్యాసధ్యములనుగూర్చికాని, వివేకావివేకములను గూర్చికాని తాత్కాలిక లాభాలాభములను గూర్చి కాని సంశయము లుండునుగాక, జాతీయధర్మాధర్మములను గూర్చి సంశయములను పెంచి తన్మూలమున పార్టీల బలములను వృద్ధి చేసుకొనగోరుటకంటె దైవద్రోహముకూదా వేఱేలేదు. సముచిత సహకార వాదులు కాలీచితమైన కార్యక్రమమును తీసుకొని వచ్చినామన్న కీర్తిని గైకొనగోరుచొ, స్వరాజ్యవాదులకు సదాశయ సంకలితమగు కార్యక్రమమున నవలంభింపగోరు చున్నారన్న యాషత్కీర్తి నొసంగక తీరరు కాంగ్రెసు, వారి మీద తన చేతినుంచినంత సేపు వారి విదానము దేశీయుల కనుసరణీయ మగు చున్నదని సముచిత వాదులు కినుక పొందరాదు. వెంటనే కాంగ్రెస్సు పెట్టించుకొని కార్యక్రమమును పునర్విమర్శనము చేయించుకొనితమకార్యక్రమమునే దేశమున కనుసరణీయముగ చేసికొనవచ్చును. కాంగ్రెసు వారిని ప్రతిఘటించు ననుటకు వీలులేదు. వారు మాత్రము సామాన్యులా, బుద్దిహీనులా? కాంగ్రెసును మెప్పించి ఒప్పించలేరా?
గరిమెళ్ళ వ్యాసాలు