అట్లు చేయలేకున్నచో తమ సిద్ధాంతములను తమలో నుంచుకొని కాంగ్రెసు ఆజ్ఞలకు బద్ధులు కావలెను. లేదా, విడిపోయి జస్టిసు పార్టీవలె వెలుపలనుండి తల్లి సంస్థను దూషించుచు వారియిష్టము వచ్చినట్లు ప్రవర్తించుకొనగల హక్కును సంపాదించుకొనవలయును. కాలమాన మెల్లయును యధోచిత సహకారవాదులకే అనుకూలముగ నున్నదని పెక్కురి యూహ. గహోతీలో వారిస్కీమే నెగ్గును. స్వరాజ్య వాదులు తల నొగ్గుదురు. ఈలోగా కొన్ని లాభములు పోవుచున్నవని తొందర మాట అనుకొనుట సముచిత వాదులకు సముచితముకాదు.
ఇట్లు స్వరాజ్యపక్ష ఆశయముల గతి యెట్లు పట్టుచున్నదో చూచినాము. యధోచిత వాదులగతి యెట్లు పట్టునో ఊహింప సాహసించుచున్నందుకు క్షమింతురుగాక! వారి స్కీమువలె వీరి స్కీమును నిరర్థకమే. ప్రతిఘటనము సముచితము లోనికి మారి పోయినట్లే సముచితము. సంపూర్ణములోనికి మారిపోక తీరదు. ఈ సంగతి తత్పక్ష నాయకులకు తెలియకపోలేదు. అందుకు సిద్ధపడియే వారును పోవుచున్నారు. "Responsive" శబ్దము ప్రజలకు "భ్రమపెట్టుట" కొరకే కాదాయని మాకు సందేహము లేకపోలేదు. దేశము శాసనతిరస్కారమునకుగాని, ప్రభుత్వమువారు మన డిమాండులను తీర్చనిచో చర్య తీసుకొనుటకు గాని తగిన స్థితిలో లేదని ఈ పార్టీ లెల్లయును నంగీకరించు చున్నవి. ఈ సందర్భములో శాసన సభ్యుల చేతిలో నున్న చర్య యెల్లయు నొక్కటియే. అది నిర్గమనము (Walk out) ఆ చర్యను రెస్పాన్సివిస్టులును, లాలాజీ మొదలగు వారును యెట్టి అవతవక హేళణతో రాజద్రోహ మనియు దేశద్రోహమనియు సిద్ధాంతీకరించుచున్నారో మనము చిత్తగించుచున్నాము. మన మాట వారు చెల్లించనిచో పౌరుషమును రోషమును చంపుకొని, యేవగింపునైన పొందక, సిగ్గు ఇంతకన్నను విడచిపెట్టి సహకారమునకు సంసిద్ధమగుట Responsive లేక సముచిత సహకార మెట్లగును. మనలో శాసన తిరస్కరణ శక్తి లేనంతసేపు ప్రభుత్వమువారు మన డిమేండులకు నూకొందురా? అట్లు విశ్వసించిన వారు విశ్వసింతురుగాక!
నిజమేమనగా దేశము శాసన తిరస్కారమునకు సిధ్దము కానంతసేపు పై వారి యిర్వురి సిద్ధాంతములకు తావేలేదు. వారి సిద్ధాంతముల
92
గరిమెళ్ళ వ్యాసాలు