పుట:Ganita-Chandrika.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

గణిత చంద్రిక.


జిల్లా పటము 1 అంగుళము=10 మైళ్ళ ప్రకారము గీయబడినది. ఇందు రెండు గ్రామములదూరము 3 అంగుళము లయిన అసలుదూరము 30 మైళ్ళని గ్రహించవలయును.

ఒక పటమును చూపి కొన్ని దూరములు కొలిపించి అసలుదూరమును కనుగొనునట్లు చేయవ లెను.

ఒక పటమున అంగుళము పదిమైళ్ళను తెలుపును. రెండుగ్రామముల మధ్య దూరము 2.5 అంగుళములు అయిన గ్రామములకు అసలుదూరము ఎంత ?

అంగుళము= 10 మైళ్ళు
2 అం.=20 మైళ్ళు
.5 అం.= 5 మైళ్ళు కనుక
2.5 అం =25 మైళ్ళు,

శరీర ఉష్ణమును కొలుచుటకు ఉష్ణమాని అనుసాధనమును వైద్యులు ఉపయోగించుటను మీరు చూచియుందురు. దీని పటమును చూడుము. పాదరసము ఎంతవరకు ఎక్కునో అచ్చట గుర్తించిన సంఖ్య ఉష్ణ పరిమాణమును తెలుపును. ఈ సాధనమున రెండు డిగ్రీలకు మధ్యస్థలము 10 భాగములు చేయబడినది. ఒక్కొక్క భాగము . 1 డిగ్రీ - ధర్మామీటరు ఒక దానిని చూడుము.