Jump to content

పుట:Ganita-Chandrika.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ తరగతి.

19


ప్రశ్నలు: -

అభ్యాసము 9.

1. 19 ని క చే హెచ్చించిన 57 నచ్చును. క ఎంతగ నుండవలయును?

2. క ను 13 చే హెచ్చించిన 182 వచ్చును. క ఎంతగ నుండవలయును?

3. ఒక సంఖ్యను 18 చే హెచ్చించి వచ్చిన మొత్తమునకు 8 కలిపిన 350 వచ్చును. ఆ సంఖ్య ఏది ?

4. ఒక సంఖ్యను 16 చే హెచ్చించి వచ్చిన మొత్తములో 9 తీసి వేయగా 263 వచ్చును. ఆ సంఖ్య ఏది ?

5. ఒక రైతుకు 187 పుట్ల ధాన్యము వచ్చినది. బండికి ఎక్కువగ వేసిన 11 తూములు వేయవచ్చును. ఈ ధాన్యమును తెచ్చుకొనుటకు ఎన్ని బండ్లు కావలయును ?

6. గంటకు 32 మైళ్ళ ప్రకారము పోవు రైలుబండి 1000 మైళ్ళు ప్రయాణము చేయుటకు ఎన్ని గంటలు పట్టును ?

7, జపాను కోరాతానులో 39 గజములు. చొక్కా-ఒకటికి 3½ గజము కావలయును. 1000 చొక్కాలు కుట్టిం చుటకు కావలసిన తానులు ఎన్ని ? పూర్తి తానులే కొనిన ఎన్ని గజములు మిగులును ?