పుట:Ganita-Chandrika.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

గణిత చంద్రిక.


8. ఒక పరీక్షకు 73 గురు పిల్లలువచ్చిరి. ఒక్కొక్కనికి 4 ఠావులు ఇవ్వవలెను. అణాకు 12 ఠావులు ఇచ్చెదరు. ఈ పిల్లలకు ఇవ్వవలసిన కాగితము ఖరీదు ఎంత ?

9. బండికి 9 బస్తాల బియ్యము వేయవచ్చును. బస్తాకు 104 శేర్లు పట్టును. 8 బండ్లమీద ఎన్ని శ్హేర్ల బియ్యము పంప వచ్చును ?

10. ఒక గామమున సాగుబడిభూమి 2843 యకరములు. 942 యకరములకు యకరము ఒకటికి రు 7 లు చోప్పునను, 1012 యకరములకు యకరము ఒకటింటికి రు 6-8-0 చొప్పునను మిగిలినభూమి యకరము 1 కి రు 6 లు చో౹౹ శిస్తు వసూలగును. మొత్తము శిస్తు ఎంత ?

11. ఒక తోటలో 125 నిమ్మ చెట్లు కలవు. చెట్టు 1 కి 150 పండ్లు కలవు. మొత్తము పండ్లెన్ని ?

12. ఒకడు యకరము 650 రూ౹౹ చొప్పున 19 యకకముల పొలము కొనెను. దీనిలో 13 యకరములను యకరము 785 రూ౹౹ చొప్పునను మిగిలిన దానిని యకరము రు 600 చొప్పునను అమ్మిన లాభముగాని నష్టముగాని ఎంత ?

18. దూది పుట్టి రూ 65 లు. పరుపునకు 6 వీశెల దూది కావలయును. 16 పరుపులకు కావలసిన దూది వెల ఎంత?