పుట:Ganapati (novel).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

తరవాణికుండను విడువలేకపోయెను. వెయ్యేల? యది యతనికిల వేల్పు, ఈ నాఁటివారు ప్రాతఃకాలమునను పగలు మూఁడవజామునను కాఫీ కానీ టీ కాని త్రాగకపోయినయెడల నెట్లు తల నొప్పులచేత బాధపడి కూర్చుండినచోట నుండి లేవలేక పోవుదురో యానాఁడు గంగాధరుడు గూడ నట్లే యుదయమున తరవాణిఁ ద్రాఁగక యది కలిసిన యన్నము కొంచెము తినక యిల్లు వెడలఁడు. పలు పిండివంటలతో శుభకార్యముల యందును కుడుములు మొదలగు వానితో శ్రాద్ధముల యందును షడ్రసోపేతముగ భుజియించి వచ్చిన తరువాత సయితము గంగాధరుడుఁ డొకనిద్దుర దీసి సత్తుతపిలెడు తరువాణి త్రాగినగాని యతని ప్రాణము తెప్పరిల్లదు. ఎండబడి వచ్చెనా యతని కదే శరణ్యము. తరవాణి యంతచే టలవాటైనప్పుడు గంగాధరుడు శ్రాద్దభోక్తగ వెళ్ళిననాఁడు సయితము ముందుగా నది కొంచెము పుచ్చుకొని వెళ్లునా యని మీకు సందేహము గలుగవచ్చును. అట్టి సందేహములకు బనిలేదు, శ్రాద్ధము చెడదా యందురేమో; శ్రాద్ధము చెడనీ పితృదేవతలు చెడనీ గంగాధరుఁడు చెడఁడు. అదియునుగాక "అన్నము పరబ్రహ్మస్వరూపము, అది చేసినదోషములే" దని యార్యులు వక్కాణించు ధర్మోక్తులు పండితుల నోట వ్యర్ధముగ వచ్చుచుండును గాని యనుభవసిద్ధిఁ గలవు. గంగాధరుఁడా వాక్యములయందు దృఢ విశ్వాసము గలిగి యన్న మెప్పుడు తిన్న