పుట:Ganapati (novel).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

డెనిమిదవ యేటనే కవిత్వముఁ జెప్పును. పూర్వజన్మ సుకృతముచేత గంగాధరునకుఁగూడ నట్టి యద్భుతప్రజ్ఞ చిన్న నాఁటనె కలిగెను. అది భోజన విషయమున ప్రజ్ఞ. అతని భోజన మీడునకుఁ దగినది కాకపోవుటచేఁ తల్లిదృష్టిదోషము తగులు నను భయమున గొంతకాలము తరచుగ బ్రాహ్మణార్థములకు బోనీయక మాధుకరవృత్తిచేత సంపాదించిన యన్న మతనికి బెట్టుచు నది మూఁడుపూటలకు సరిపోక యాయవారమెత్తి తెచ్చిన బియ్యము వండిపెట్టుచు గాలక్షేపము సేయుచుండెను. తల్లిప్రాణ మగుటచే బిడ్డ దృష్టి తగిలిన యెక్కడ చెడిపోవునో యని కడు భయపడుచు బ్రాహ్మణార్థముల కతడు పోయివచ్చిన తరువాత మిరపకాయలు దిగదుడిచి పొయిలోఁబోసియుఁ గచ్చిక లాముదములో ముంచి దీపము వెలిగించి చుట్టుద్రిప్పి వీధిలో బారవైచియు నుప్పు దిగదుడిచి నూతిలోఁ బారవైచియు బిచ్చమ్మ బహు విధముల దనయున కంగరక్షణ చేయుచుండును. ఇంటికి జుట్టములు వచ్చినపుడు పిచ్చమ్మ కుమారుని వారి పంక్తికెన్నఁడు రానీయదు. గంగాధరున కన్నాదరువులు విశేషమక్కఱలేదు, తఱవాణిలోని యన్న మూరఁగాయ గాని నీరుల్లి పాయగాని నంజుకొనుచు నది యెంతో యాప్యాయముగ దినును. తరవాణికుండ యతనిపాలిఁటి కమృతభాండమె. పెద్దవాఁడైన తరవాఁతఁగూడ గంగాధరుడు చిరకాల సహవాసముచేత గాబోలు తల్లినైన విడువగలెగెను కాని, యుల్లిని