పుట:Ganapati (novel).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

79

వచ్చును. మీరు నాకు వడ్డీ యియ్య నక్కఱలేదని పలికెను. ఈ యేర్పాటు బాకీదార్లకునచ్చెను. అందరును దిరిగి యన్నప్ప పేర నోట్లువ్రాసి యిచ్చిరి. ఇటువంటి విషయములలో నన్నప్ప మాట దప్పనివాడు. కావునఁ దనయల్లుని పేరనున్న వెనుకటి నోట్లు వానియెదుటనె ముక్క ముక్కలుగఁ జించిపారవైచెను. తాను వ్యవహారములో జేసినమార్పు కూతురి కెఱిఁగింపలేదు. ఎందుల కెఱిగింపలేదని యడుగుదురేమో, మగని పేరు చెప్పిన మాత్రమునను వానికాగితముల విషయమెత్తిన మాత్రమునను వాని సొమ్ముమాట సంస్మరించిన మాత్రమునను సముద్రమువలె దుఃఖము పొరలి పొరలిరాఁగా బిడ్డ బెంగఁ బెట్టుకొనునని చెప్పక యుండవచ్చును. లోకులు కాకులన్న మాట నిజము. కూఁతురు మనుమఁడు కోర్టులెక్కవలసిన యవసరం లేకుండ నొక్క బాకీదారుని యింటికివెళ్ళి యడుగవలసిన యవసరం లేకుండగా గాలదోష మెప్పుడు పట్టునోయని కాగితములు చూచుకొన వలసిన యవసరం లేకుండ నన్నప్ప కూతురుసొమ్ము తనసొమ్ముగ మనుమని వ్యవహారము తనవ్యవహారముగఁ జూచుకొనుచుండఁ గిట్టని వాండ్రు కొందఱు లేనిపోని నిందలతనపై వైచిరి. ఎవరేమకొన్న నతనికేమి? అతడు చేయఁదలచుకొన్న పని సూటిఁగ జేసెను. దూషణ భూషణ తిరస్కారంబులు దేహంబునకు గానిపరమాత్మకు లేవన్న మాట యన్నప్పకు సార్థకముగఁ దెలియును. బంధువులు గ్రామస్థులు బిల్లవాని కేమైన గొంత