పుట:Ganapati (novel).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

గ ణ ప తి

సొమ్ముదానికి పెట్టదలఁచుకొన్నాను. కానియెడల నీపదియేనువందల రూపాయలేమూలకు సరిపోవును. పిల్లవానికి వడుగు గావలెను; చదువు సంధ్యలు చెప్పించవలెను. బట్టలు పాతలు గావలెను. సంసార మనఁగా సముద్రము. మీకు తెలియని దేమున్నది. అదిగాక యీ వ్యవహారములో నేదైన నొకటి కోర్టుకెక్కెనా నాకూఁతు రాఁడదిగదా. అది కోర్టుకు రాఁగూడదు కదా? పిల్లవాడు కోర్టుకు వెళ్ళు టంతకంటే వీలులేదుగదా? నేనే కోర్టుకువెళ్ళి యావత్తు గ్రంధము జరిపించవలసిన వాడను. గనుక నాపేరనె కాగితము లున్నపక్షమున నెంతో వీలుగనుండును. నామాట వింటిరా మీకేదో కొంత సదుపాయము జేసెదను. ఆమాట నోట రాఁగానే కొందఱు బాకీదారులు వడ్డీమాను మనిరి. కొంద రసలులోఁ గొంత తగ్గించు మనిరి. కొందరు కొన్నిశంకలు బయలుదేరఁ

పిల్లవాఁడు చిన్నవాఁడు కదా అతఁడు పెద్దవాఁడైన తరువాత వెనుకటి కాగితములను బట్టి మామీఁద వేజ్యం వేసి మాకొంప లమ్మించును. అప్పుడు మీరును మీ మనుమఁడును సుఖముగ నుందురు, నడుమ మేము చెడిపోవుదుము. దీనికేమి చెప్పుదురని వారు స్పష్టముగ నడిగిరి. సమయోచితి బుద్ధికి బృహస్పతి యని చెప్పఁ దగిన యన్నప్ప దానిఁకి దగినయుత్తర మీయలేకపోవునా? పాపయ్య పేర నున్న నోట్లు మీ యెదుట జించివైచెదను. క్రొత్తగా మీరు నాయొద్ద బదులు పుచ్చుకొన్నట్లు నోట్లువ్రాసి యియ్య