పుట:Ganapati (novel).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

67

త్తుగలేచి యిల్లెగిరిపోవునట్లు బెద్దబెద్ద కేకలు వేయుచుఁ గొండ ముచ్చువలె గంతులువేయుచుఁ జేతులు బారలు జాపుకొని యాడుచుఁ దనకోపములోఁ గొంతభాగము నీవిధముగ వాక్యరూపమున వెళ్ళబుచ్చెను. "పునహా సతారాలలోజేరి పీనుగులు మోసుకొనునట్టివానికి మాణిక్యమువంటిపిల్లను దీసికొని వచ్చి కట్టబెట్టుట నాదే బుద్ధితక్కువ. తనవంశ మెక్కడ నిలువకపోవునో యని భయముచేత నాపిల్ల నిమ్మని యెందరిచేతనో నాకు వర్తమానమంపి నాకాళ్ళు, కడుపు బట్టుకొని బ్రతిమాలుటచేత బ్రాహ్మణవంశ మొకటి నిలువబెట్టిన పుణ్యము, బ్రతిష్టయుఁ గలుగునని పిల్లనిచ్చితిని. లేనియెడల నఱువదియేండ్ల వానికి నేను నాపిల్లనిత్తునా? పెద్దవాఁడైనప్పటికి సాంప్రదాయము కలవాఁడు పరువుగలవాఁడు గదా యనుకొంటిని గాని పరువుమర్యాదలు లేని వంటపూటివెధవ యనుకొనలేదు. ఇది యేమి పాడుగ్రామమొ కాని యీ దరిద్రగొట్టు గ్రామమునుండి యెన్నిసారులు పయనమై పోవఁదలచినను దుశ్శకునములె. ఊరునిండా మాయపిల్లులు, మాయముండలు. ఇంటిలోనుండి వీధిలోని కడుగు బెట్టితిమా యెదురుగా నొకముండ సిద్ధము. తొంగి చూచితిమా యెక పిల్లి సిద్ధము. శని గాని ప్రతిష్ఠగల గ్రామములో నింతకంటె నెక్కువుండునా! ఛీ! నాగౌరవము గంగపాలు చేసినావు. నాపరువు బండలు చేసినావు. నేనెంతో గౌరవముఁగ గాలక్షేపము సేయుచున్నాను. అత్తమామలకు నాలుగుదినములు