పుట:Ganapati (novel).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

గ ణ ప తి

కొనుటకై దేశమందలి యెల్లవారు మందపల్లి బోవుచుండఁగా మందపల్లిలోనే యున్న పాపయ్యకు శనిగ్రహపీడ వదలక పోయెను. ఇది తిలదానముతో వదలెడి శనిగాదు; తైలాభిషేకముతో వదలెడి శనిగాదని పాపయ్య మునసబు కరణాల తోను గ్రామములోని తక్కిన పెద్దమనుష్యులతోడను నాలోచనలు చేయసాగెను. ఎవరికి దోఁచినట్లు వారు సలహాచెప్పిరి. నాయింటనుండిమీరు లేచిపోవలసినదని స్పష్టముగఁ జెప్పుటయె మంచిదని మునసబు సలహా జెప్పెను. ఉప్పు పప్పు బియ్యము మొదలగు పదార్థములు లింటలేకుండఁ జేసినీవు పది దినములే గ్రామమైన వెళ్ళవలసినదని కరణము హితోపదేశముచేసెను. ఆ రెండుపదేశములు బాపయ్య కంత రుచింపలేదు. ఇకఁ గొంతకాల మోపిక పట్టవలయునని యతఁడు నిశ్చయించుకొని పిల్లిమీఁదఁబెట్టి యెలుకమీదబెట్టి సూటిపోటిమాటలు మామగారి కర్థమగు నట్లనఁజొచ్చెను. పిచ్చుకమీఁద బెట్టి పీటమీఁదఁబెట్టి యన్నప్ప యల్లుడన్న మాటలకు దగినట్లు ప్రత్యుత్తరము జెప్పసాగెను. ఎట్టకేలకు పాపయ్య కోపిక క్షీణించెను. ఒక నాఁటి రాత్రి భోజనానంతరమున నూతి నరసింహ మనెడు మిత్రుని బిలిచికొనివచ్చి మామగారిని వెళ్ళిపొమ్మని యతనిచేత వర్తమాన మంపెను. నరసింహ మెంతో మృదువుగాను యుక్తియుక్తముగాను పాపయ్య యభిప్రాయమన్నప్పగారితో జెప్పెను. కాని యా పలుకులు వినగానే యన్నప్పకు వచ్చిన కోప మింతని వర్ణింప నలవిగాదు. గూర్చుండినవాఁ డువ్వె