పుట:Ganapati (novel).pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

305

మా కుత్తరము చెప్పలేదు. వాళ్ళ నోళ్ళు చిన్నవి. కడుపులు బానకడుపులు. మడమలు ముందరికి పాదములు వెనుకకు నున్నవి. చిన్నప్పుడు మా తాత మా నాయనమ్మ దయ్యము లాలాగుండునని చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చెను. అవి కొరవిదయ్యము లని మే మప్పుడనుకొంటిమి. కేకలు వేసిన పక్షమున నోళ్లు నొక్కునని మేము కిక్కురు మనకుండ మా ప్రాణము లరచేతిలోఁ బెట్టుకుని పారిపోయితిమి. మిమ్ము లేపుటకయిన వ్యవధానము లేకపోయినది. ఆ కొరవి దయ్యములే యింతపని చేసినవి!" గణపతి కా మాటలు సత్యములని తోచెను. ఎవరో కొంటెపిల్లవాండ్రాపని చేసి యుందురని చూడవచ్చిన గ్రామవాసు లందరు నేకగ్రీవముగాఁ జెప్పినను గణపతి వారి మాటయందు లేశమైన విశ్వాసముంచక తన విద్యార్థుల మాట యందె నిండు నమ్మిక యుంచి పిశాచ మాంత్రికుని కడకు బోయి వానికి గొంత ద్రవ్య మిచ్చి మంత్రించిన విభూతి పుచ్చుకొని మేనఁ బాముకొని రెండు రక్షరేకులు పుచ్చుకొని రెండు భుజములకుఁ గట్టికొని వీథులలో నెన్నఁడు బండుకొనఁ గూడ దని లోపలనె బండుకొనుచుండెను. శిష్యుల కొంటెతన మెరుఁగడూ గనుక వారినే నమ్మి తన ప్రక్కను వారిని బండుకోబెట్టుకొను చుండెను. ఒకనాఁ డొకఁ శిష్యుఁడు చేదత్రాడు దెచ్చి వాని జుట్టుకు ముడివైచి యాత్రాడు దూలమునకుఁ గట్టెను. ఆ నాఁడు గణపతికి నిద్రలో దాహము విశేషముగ నైనందున రెండు జాముల రాత్రివేళ నతనికి మెలఁకువ