పుట:Ganapati (novel).pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

279

చున్నాఁడని తెలిసినప్పుడు జ్వరమునుగూర్చి యతఁడు చేసిన చిన్న యుపన్యాస మెల్లవారు వినఁదగి యున్నది. జ్వరమెందుకు వచ్చు ననగా మన కడుపులో బొడ్డుదగ్గర దీపముండును. ఆదీప మొకప్పుడు భగ్గున మండి పెద్దదగును. అప్పుడు లోపల వేఁడి చాల పుట్టును, లోపల వేడిచేత పై చర్మము గూడ వెచ్చబడును. లోపల దీపము మండుచుండుటచేతనే జబ్బుగా నున్నవానికి కడుపులో మంటలు బయలుదేరును. ఆ దీపము తగ్గి యథాప్రకారమైతే జ్వరము తగ్గిపోవును. ఆ దీప మారిపోయినప్పుడు మనము చచ్చి పోవుదుము. ఆ దీపము వెలుగుటకే మన్నములో నెయ్యి చమురు వేసికొనవలెను. చమురు లేకపోతే దీపాలు వెలుగవు కదా!

ఉరుములు వర్షములు పిడుగులు మొదలగువానిం గూర్చి గణపతి యీ విధముగఁ జెప్పుచుండును. "దేవుడు బండియెక్కి యాకాశముమీఁద తిరుగుచుండును. ఆ బండి చప్పుడే వురుములు. అప్పుడప్పుడా బండి సీల లూడి క్రింద పడుచుండును. అవియే పిడుగులు. దేవుని బండికి గట్టిన గుఱ్ఱాల డెక్కలు రాళ్ళమీఁద తగులుటవల్ల నిప్పులు మంటలు బయలుదేరును. అవే మెరుపులు. వాననగా తిరిగితిరిగి వచ్చినమీఁదట దేవుని వంటిమీఁద పట్టిన చెమట. గాలి వేసినప్పుడు వాన రాకపోవుటకు గారణ మేమో తెలుసునా? గాలి విసరునప్పుడు చెమట యారిపోవును. సూర్యుఁడనఁగా దేవుడుఁగారి యింట బెట్టుకొన్న కుంపటి. చంద్రుఁడంటే