పుట:Ganapati (novel).pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

277

ప్రక్కలు జూచి తన బుద్ధి నుపయోగించి యర్థము చెప్పవలయునని నిశ్చయించి పద్య మా పిల్లవానిచేతనే చదివించి యీవిధముగ నర్థము చెప్పెను. శ్రీరఘురామ=శ్రీరాములువారు, చారు=ఒకనాడు పైత్యముగా నుండి చారు కాపించుకొన్నారు. తులసీ దళదామ=ఆ దేశములో కరివేపాకు లేదు గనుక తులసీ దళములే యందులో వేసి పొంగించినారు. శమక్షమాది శృంగార గుణాభిరామ=శ్రమ యావత్తు పోగొట్టగలిగి బహు శృంగారముగా నున్నదట, ఆ చారు త్రిజగన్నుత శౌర్యరమాలలామ=ఆ చారు త్రాగిన తరువాత ఆ రాములు వారికి కావలసినంత శౌర్యము గలిగిందట, రాక్షసులను చంపుటకు - దుర్వారకబంధ రాక్షస విరామ=వారి కందరకు కఫము పుట్టకుండ పోయినదట. జగజ్జనకల్మషార్ణవోత్తారికనామ= ఆ చారు తారక మంత్రములాగు త్రాగిన జను లందరకు గల్మషము కొట్టివేసినది. భద్రగిరి=వారి కెంతో భద్రము కలిగినది." అంతవర కర్థము చెపునప్పటికే ప్రశ్న మడిగిన పిల్లవాఁడు నవ్వు పట్టలేక నవ్వుచునే "వహవా పంతులు గారూ! వహవా! ఈ పద్యార్థము నే నెందరు పండితులనో యడిగితి, కాని మీ వలె నింత రసవంతముగా జెప్పినవా రొక్కరును లేకపోయినారండి. రాయలవారి వంటి మహారాజొకఁ డిప్పుడున్న పక్షమున మీ వంటివారి కెన్నో యగ్రహారములు లిచ్చు" నని యాతని ప్రజ్ఞా విశేషము నుగ్గడించెను. గణపతి యా ప్రశంస యంతయు నిక్కముగాఁ దలంచి మిక్కిలి వినయముతో "అయ్యా ! నే