పుట:Ganapati (novel).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

217

గావించిన పరాభవమును దలంచుకొని వల వల యేడ్చెను. ఆ విషయమున భార్య నిర్దోషురా లని భర్త మనంబునకు నచ్చెను. నచ్చుటయు గణపతినిఁ జూచినంత మాత్రముననే మ్రింగి వేయవలె నన్నంత కోప మాయన మనస్సులో నుదయించెను. కాని గణపతి తల్లికి మాత్రము సోదరుని భార్య చెప్పిన నేరములు తలకెక్కలేదు. ఆమె యేదో గొప్ప యనాదరము చేసియుండబట్టి మిక్కిలి బుద్ధిమంతుడైన తన కొమారుఁ డిట్టి గొడవఁ జేసి యుండునే గాని యూరక మేనత్తకు నిష్కారణ పరాభవము గలిగింపఁడని యామె యభిప్రాయపడెను. అంతలో నంతకుముందు జరిగిన గొడవలలో గణపతి పక్షమూనిన ముసలమ్మ తీర్థయాత్రలు చేసుకొని వచ్చిన గణపతి తల్లింజూడవచ్చి, కోటిపల్లి వెళ్ళి సోమేశ్వరస్వామివారి దర్శనము చేసి ధన్యురాలైనందు కామెను శ్లాఘించి చెవిచెంత జేరి మెల్లఁగా " నా తల్లీ! నీవు లేని నాలుగు రోజులలో మీ వదినెగారు నాలుగు భాగవతము లాడినది. అది యెంతకయిన సాహసురాలే. నీ కొడుకుకు సరిగా నొకపూటైన అన్నము పెట్టలేదు. నాలుగు రోజులు నాలుగు యుగములై పోయినవి. అన్నము లేక విడ్డ అడలిపోయినాడు. ఒకపూట మా యింటికి తీసికొని వెళ్ళి పట్టెడన్నము పెట్టినాను. వాడివల్ల రవంత దోషమైన లేదు. అది కొంపలు మాపఁగల కొఱవి. దాని మొగము చూచితే పంచమహాపాతకములు చుట్టుకొనును. నీ కొడుకు చాలా మంచివాఁడు. కనుక నాలుగురోజులు ఎంతో