పుట:Ganapati (novel).pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

గ ణ ప తి

అంతేకాని పూటకూళ్ళదానిని దాసీదానిని యల్లరిచేసినట్లు ఈ లాగల్లరి చేయవచ్చునా?" అని కంటఁ దడిపెట్టుకొని గద్గదస్వరముతో మాట్లాడెను. అనవుడు బంధువుఁ డిట్లనియె. "అమ్మా! గృహకృత్యములలో నొకరు తగవు చెప్పుట కష్టము. అయినదేమో అయినది. ఆ మాట మీరు తలఁచుకోవద్దు. ఈ రాత్రియో రేపో అతని తల్లి వచ్చును. వచ్చిన తరువాత మరే గొడవ లుండవు. చిన్నతనము చేత వాడు చేసిన తెలివితక్కువ పనులు పాటింపక సర్దుకోవచ్చును. సరే; ప్రస్తుతము వానికి కావలసిన వస్తువు లొడ్డించండి. అన్నము తిన్నదాక యుండి తరువాత నా వెంట తీసికొనిపోదను." అనవుడు నామె మంచిదని కావలసిన వస్తువులు వడ్డించెను. గణపతి భోజనము చూచిన తరువాత చుట్టము గణపతి తిండిపుష్టి గలవాఁడనియు నతనికిఁ గొంచె మన్నము మాత్రమే పెట్టుట చేత మేనత్త లోపమనియు గణపతి చేసిన యల్లరికి గొంత కారణము లేకపోలేదనియిఁ దలంచెను. గృహకలహములలోఁ బౌర్వాపర్యములు విచారింపక నొకపక్షము మాత్రమే వినువారి కిట్టి యభిప్రాయములు దోఁచుట యాశ్చర్యము కాదుగదా ! ఆ సాయంకాలము కోటిపల్లి నుండి గణపతి తల్లియు, మేనమామయు వచ్చిరి. రాఁగానె గణపతి యాడిన విచిత్ర నాటక వృత్తాంత మంతయు మేనత్త తన యాడుబిడ్డతోను భర్తతోడను బూసగ్రుచ్చినట్లు చెప్పి తన కతఁడు