పుట:Ganapati (novel).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

గ ణ ప తి

నిల్లు నిండి చాలకపోయెను. విశూచి మశూచి మొదలగు జాడ్యములు ప్రబలినపుడు మంచములు మొదలగునవి స్థలము చాలమి, యింటికి పట్టుకొని వెళ్ళుటకు వీలులేక, యప్పటి కప్పుడె బేరములిచ్చి యమ్మివేయుచుండును, కూరలు కావలసినవారికి తల్లి దానము చేయఁజొచ్చెను. పూర్వము తాను తల్లియు జాపలమీదనే బండుకొనుచు వచ్చిరి. ఇప్పుడు తల్లికి మంచము పరుపు, తనకు మంచము పరుపు, సింహాచలముయొక్క గృహమున మూడు మంచములు మూఁడు పరుపులు, తనస్థితి కొంచెము స్థిరమైనతరువాత గంగాధరుఁడు కొంచెము త్రాడుబారి పురోహితుల కీయవలసినభాగము క్రమక్రమముగ నేదోవంక బెట్టి యెగబెట్టఁజొచ్చె. అందుచేత కొంచెము డబ్బుచేత నిలువజొచ్చెను. అదివరకునల్లమందుకైన సరిగాడబ్బు లేని తల్లి బియ్యము పప్పులు మొదలగునవి యిరుగుపొరుగువారికమ్మి కొంతసొమ్ము చేసికొనియెను. అతని జాతకమావిధముగ మహోచ్చదశ గలిగి పెళ్ళున వెలుగుచున్న కాలములో నతని కొక గొప్ప విపత్తు సంభవించెను. ఇంచుమించుగా గాకినాడ వచ్చినది మొదలుకొని యతని యర్థదేహమైయుండిన సింహాచలము కాలధర్మము నొందెను. సింహాచలము పెద్దదగుటచేత దాని మరణ మంత లోకవిరుద్ధముగ లేకపోయినను గంగాధరుఁడు చిరకాల సహవాసము చేత మిక్కిలివగచి పదిదినములన్నము దినక యేమియుం దోఁచక పిచ్చివానివలె దిరిగి మిత్రుల యారడింపుల వలనను మరికొందరు చేసిన జ్ఞానోప