పుట:Ganapati (novel).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

109

దేశము వలనను ధైర్యముఁ దెచ్చికొని కొంత దుఃఖోపశమనముఁ జేసికొనియెను, కాని సింహాచలము మీఁదఁ దనకు గల యనురాగాతిశయముఁ దెలియఁజేయుటకు దాని పేరుగ నొక్క పిల్లయైనను లేకపోయెను గదా యని పలుమాఱు విచారించెను. అయినను విచారించినఁ గార్యము లేదని గ్రహించి దాని కుత్తరగతులు కలిగింపవలెనని రమారమి యేఁబదిరూపాయలు కర్చుజేసి దాని కులమువాం డ్రందఱు మెచ్చున ట్లుత్తరక్రియలు చేయించి సంతర్పణ చేయించెను. జ్ఞానము వచ్చినతరువాత నతనికిఁ గలిగిన గొప్పకష్ట మిదియె. సింహాచలము బ్రతికియున్నపుడు మూఁడునాలుగు దినముల కొకసారి గంగాధరుఁడు దానికి నల్లమందుఁ గొనితెచ్చి యిచ్చుచుండువాఁడు, గావున నది మృతినొందిన తరువాత నాఱుమసముల వరకు నల్లమందు దుకాణము కనఁబడినపుడెల్ల నతఁడు పట్టరాని దుఃఖము గలిగి యే గోడకో జేరబడి కొంతసేపేడ్చి పోవుచుండును. దైవవశమున సింహాచలము తోడ స్నేహబంధము విడిపోయిన తరువాత గంగాధరుడు నిస్పృహుఁడై మఱి యొకతె సహవాస మపేక్షింపక వివాహముఁ జేసికొనవలయునని దీక్షగలిగి ధనము నిలువఁ జేయదలంచెను. కాని జూదపుపాక వానిప్రయత్నమునకు విఘ్నము గలిగించుచు వచ్చెను. అక్కడకు వెళ్ళకుండవలయు నని యప్పు డప్పు డతఁడు నిశ్చయము జేసికొను చుండును. కాని యభ్యాసముచేత ప్రయత్నము లేకయే కాళ్ళు వాని