పుట:Ganapati (novel).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

99

చిన యర్జునుఁడు జ్ఞప్తికి వచ్చును. పచ్చడిచేయుటకు నీవు బండ పుచ్చుకొన్నప్పుడు నాగలిధరించిన బలరాముడు జ్ఞప్తికి వచ్చును. వడ్డించుటకు పళ్ళెము పుచ్చుకొన్నప్పుడు సుదర్శనచక్రము ధరించిన హరి మనంబునం దట్టును. నీపాకము నలపాక భీమపాకముల మించును. నీవు చిమ్మిలిముద్దలు మ్రింగుచున్నపుడు చూచినవారు పూర్వకాలము శంకరుఁడు కాలకూట విషపుముద్ద నిట్లె మ్రింగెనని సముద్ర మధన వృత్తాంతము జ్ఞప్తికి దెచ్చుకొని సంతసించు చుందురు. నీకీర్తి బుఱ్ఱ గుంజువలె ముంజవలె సున్నమువలె చల్లవలె విభూతివలె మరబియ్యపన్నమువలె ముసలివాని తలవలె నెంతో తెల్లనై దిక్కులయందు వ్యాపించియున్నది. ఆ కృతిపతికిని కృతికర్తకు నాకవిత్వమునకు 'తగు దాసరికి మెడపూసలకు' నన్నట్లు సరిపోయెను."

ఏడవ ప్రకరణము

భగీరథుఁడు మహాప్రయత్నము జేసి కష్టపడి గంగను భూమికిఁ దెచ్చి జగజ్జనులకు మహోపకారము చేసిన తెఱగున గంగాధరుఁడు కష్టపడి గంగను దెచ్చి కాకినాడ పురవాసుల కిచ్చి వారికి మహోపకారము జేయుచు గాలముఁ గడుపుచుండఁగా నొక వైపరీత్యము జరిగెను. అది కాకినాడ