Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ.సా.:- ఉపదేశములను పాటించుటకు ప్రయత్నించు చున్నాను. కాని వర్ణ భేదము బాధకరముగా నున్నది. అది పోవలసినదే.

మహర్షి:- అది ఎవరికి బాధను కలిగించు చున్నది?

ఆర్యసామాజికుడు:- సమాజములోని సభ్యులకు......

మహర్షి:- చెప్పుచున్నది నీవు. వర్ణభేదములులేని దేశములున్నవి. వానియందు కష్టములు లేవా? అక్కడ యుద్ధములు పరస్పర హత్యలతో సంఘర్షణములు మొదలగునవి వున్నవి. నీవు ఆ ఘోర పరిస్థితుల నేల చక్కబెట్టుట లేదు?

ఆర్యసామాజికుడు:- కష్టములు ఇక్కడకూడ వున్నవి.

మహర్షి:- భేదములు ఎల్లప్పుడు వుండును. ఇక్కడ మనుష్యులు మాత్రమే కాదు. జంతువులు, చెట్లు కూడ వున్నవి. ఈ పరిస్థితిని మనము ఏమియు చేయలేము.

ఆర్యసామాజికుడు:- జంతువులు మొదలగువాని సంగతి ప్రస్తుతము మనకు అక్కర లేదు.

మహర్షి:- ఎందుకు అక్కరలేదు? అవి మాటాడ గలిగినచో నీతో సమానత్వమును తమకు హక్కుగా ప్రకటించుచు మానవుల కంటే తీవ్రముగా నీ హక్కును ప్రతిఘటించ గలవు.

ఆర్యసామాజికుడు:- దానికి మనము ఏమియు చేయలేము. అది ఈశ్వరుని పని.

మహర్షి:- అది ఈశ్వరుని పనియైనచో తక్కినది నీ పనియా? అంతేనా?

ఆర్యసామాజికుడు:- నేను భేదములను కాదనుట లేదు. ఆధిక్యమును గూర్చి హక్కులు మాత్రము తప్పు.