Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13-2-1936 తేది వేదపఠనము ముగిసిన తరువాత అనంతపురము నుండి వచ్చిన యొక పెద్దాయన లేచి మహర్షి నిట్లు అడిగినాడు. 'బ్రాహ్మణేతరులు వేదమును వినరాదని చెప్పబడి యున్నది.'

మహర్షి:- నీ సంగతి నీవు చూచుకొనుము. నీ వెందులకు ఇక్కడికి వచ్చితివో ఆ విషయమున శ్రద్ద వహింపుము. ఈ విషయములతో ఏల కాలమును వ్యర్థము చేయుదువు? 'నేను వేద పఠనమును విన్నాను' అని నీవు అనుచున్నావు. అ నేను ఎవరు?... ముందు ఆ 'నేను' ను కనుగొనుము. తరువాత తక్కిన విషయములు మాటాడ వచ్చును.

కొంత సేపైన తరువాత మహర్షి మరల ఇట్లనెను. ' అనాది కాలము నుండి ప్రపంచములో అనేకులు, 'స్మృతులు ఏవో విషయములను చెప్పుచున్నవి. అవి ఈ కాలమునకు తగవు. నేను ప్రపంచమును సంస్కరించెదను. స్మృతులను తిరుగ వ్రాయుదును' అని గంతులు వేయుచునే యున్నారు. అట్టి సంస్కర్తలు వచ్చినారు పోయినారు. కాని ప్రాచీనములైన స్మృతులు నిలిచియే యున్నవి. అట్టి విషయములపై కాలమును వ్యర్థ మొనర్చుట యెందులకు? ప్రతి వ్యక్తి తన పనిని తాను చూచుకొను చున్నచో అంతయు చక్కగానే యుండును.

13 th February 1936

161. An elderly man from Anantapur, after hearing veda recital in the hall, stood up and asked: "it is