శ్రీ రమణ మహర్షి శిష్యులకు నాయన విషయమున అభిప్రాయభేదములు కలుగుటకు హేతువులు ఓరుగంటి వేంకట కృష్ణయ్య మాటలలో సూచితము లగుచున్నవి; "నాకు తెలిసిన నాయన సనాతన ధర్మావలంబికాడు. ఆధునిక సంస్కర్తకాదు. ఆయన మార్గ మాయనదే. మురారే స్తృతీయ: పంథా" (మురారి కవిది మూడవత్రోవ).
మల్లాదివారితో ఆయనకు చండాలుల దేవాలయ ప్రవేశ విషయమున జరిగిన ప్రచండయుద్ద మంద ఱెరిగినదే. ఆయన జాతి చండాలత్వ మొప్పడు. వర్ణములు జాత్యా అను సనాతనుల మత మొప్పడు అట్లే వేదములందలి పంచజన శబ్ద మావర్ణమున కాయన అన్వయింపడు. ఆచారవిషయమున గూడ"*[1]
వేంకటకృష్ణయ్య మిత్రులతో ప్రసంగించునప్పుడు, "మా గురువు గారు మహాపండితుడు. నేను అల్పజ్ఞుడను. అయినను మహర్షుల యభిప్రాయమునకు భిన్నముగా వారు చెప్పునప్పుడు నేను మహర్షుల యభిప్రాయమునే గ్రహింతును గాని నాయనగారి యభిప్రాయములను అంగీకరింపను" అని స్పష్టముగా చెప్పు చుండెడివారు.
దీనిని బట్టి నాయన యభిప్రాయములు కొన్నియెడల శిష్యులకే కాక గురువైన మహర్షికి కూడ నచ్చ లేదని వ్యక్తమగు చున్నది.
- ↑ * జయంతి సంచిక పుట-7