Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాని యర్థముగా ఎన్నో భావములు రావచ్చును గదా. యెట్లు వచ్చును. ఐకాగ్ర్యం హి తప: అన్నారు గదా. అతి తీక్ష్ణము నైన స్వరముతో భగవాను చీవాట్లు పెట్టిరి. భా: భావన! అర్థభావన నేను చేయమన్నానా? ఎవడు జపము చున్నాడో ఆ వానిని జూడుమన్నానా? సాక్షాత్తుగా నీ ఉపదేశము నాకెన్నడును మహర్షి చేయలేదు. వారు చేసినది, మ పాదులు నాయనకు. మీ గురువునకు చెప్పినచో నీకు చెప్పుట కాదా అని వారి చీవాట్లు." జయంతి సంచిక-పుటలు

1927 ఫిబ్రవరిలో హైదరాబాదులో నాయనకు బిరుదముతో సత్కారము జరిగిన తరువాత జూలైలోగాని రమణాశ్రమమునకు తిరిగి రాలేదు. ఈ లోపల అ సవ వలన కలిగిన ప్రతిస్పందనములను గూర్చి గుంటూరు కాంతము ఇట్లు వ్రాసెను. "ఇంతగా కొనియాడబడిన యొక్క మహోన్నతిని గుఱించి వినినప్పు డసూయాపరులై భావోద్రేకములను తిరువణ్ణామలలో బొందిరో తెలియదు. ఈ వార్తలు అప్రాంతము చేరులోపున సుధన్వ కపాలులు శ్రీ అరవిందాశ్రమమున చేరి నాయనను నిరసించిన వారికి బలము, నా సంతోషాతిశయభంగము చేకూర్చిరని మాత్రము సికింద్రాబాదు హైదరాబాదు శిష్యులకు తెలిసెను.[1]

  1. * నాయన-పుటలు - 577, 578.