Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ యుదంతమున నిర్ణీతాంశము లేమి?

1) లోకములు, మరణానంతరానుభావ్యము (మరణమునకు పిమ్మట అనుభవింపదగినవి) లున్నవి. పితృలోకములు కలవని వేఱుగా చెప్ప నక్కరలేదు కదా.

2) దేహ నాశనముతో వ్యక్తి నశింపడు. సూక్ష్మోపాధులతో (ఉపాధులు - శరీరములు) ఆయా లోకముల చరించుచుండును.

3) ఆ జీవికి ప్రేతత్వదశ యందేమి పితృస్వరూప దశయందేమి తృష్ణ లుండును.

4) సంతతివారు శాస్త్రోక్తములైన కర్మల నొనరించి ఆ జీవి కుద్గతి (ఉద్గతి - పైకి పోవుట) నీయగలరు.

5) శాస్త్రోక్తముగా నాయా కార్యములను మంత్రయుక్తముగా ఒనరింపవలయును; మంత్రరహితముగా గాదు. అనగా స్వరయుక్తమంత్ర సహితముగా"[1]

పై యుద్దరణములో (Quotation) కుండలీకరణములలో నున్న యర్థములు నే నొసంగినవి.

ఓరుగంటి వేంకట కృష్ణయ్య నాయన గారి శిష్యులలో వలె శ్రీ రమణమహర్షి శిష్యులలోకూడ ప్రముఖుడే. ఈ యనుబంధమును ఆయన ఇట్లు వివరించెను.

"భగవాను నొకసారి నే నడిగితిని. వేదమంత్రములకు భావన ప్రధాన మందురు. గాయత్రీ మంత్రమును జపించు మంటిరి.

  1. * "నాకు తెలిసిన నాయన" కృష్ణభిక్షు - కావ్యకంఠ గణపతి ముని జయంతి (సంచిక) 1979 - పుటలు - 7, 8