పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వివరణముగా 300 శ్లోకములతో 18 అధ్యాయములలో నాయన పూర్తిచేసెను. అదియే "రమణగీత"గా ప్రసిద్దమయ్యెను.

అమ్మ యభిలాషను అనుసరించి నాయన దైవరాతునితో 1917 అక్టోబరులో పడైవీడునకు చేరెను. ఆమె అక్కడ 40 దినములు తపోదీక్ష వహించెను. కుమారుడైన మహాదేవునకు వివాహము నిశ్చయమగుటచే 1917 పిబ్రవరిలో వారు దైవరాతుని ఇంటికి పంపి ఆశీస్సుల కొఱకు రమణునియొద్దకు వచ్చిరి. అప్పుడు నాయన మహర్షి సోదరునకు సన్న్యాసము నొసంగి నిరంజనానందుడు అను పేరు పెట్టి, ఆయన తల్లి అలఘమ్మకు కూడ సన్న్యాసము నొసంగెను. తరువాత ఆయన కలువఱాయికి చేరి 15-3-1918 తేది కుమారునకు వివాహమును జరిపించెను. అక్కడ 6 నెలలుండి అరసవల్లి క్షేత్రయాత్ర గావించెను.

ఈ సందర్బమున వాసిష్ఠ వైభవమునందు శ్రీ కపాలశాస్త్రి "సంస్కృతభాషను అధ్యయన మొనరింపని మహర్షియొక్క హృదయమునుండి స్వయముగా పైకి వచ్చిన "హృదయ కుహర" అను శ్లోకము ద్వితీయ విషయముగా వివరింపబడినది" అని యుద్ఘాటించెను. "భగవతోఽ నధీత సంస్కృత గిరో మహర్షే:స్వతో హృదయాదుద్గతో "హృదయ కుహర" ఇతి శ్లోకో ద్వితీయాధ్యాయత యోపన్యస్త:" (205 ప్రకరణము-20) శ్రీ రమణమహర్షి సంస్కృతమును నేర్చుకొనలేదనుట అసంగతము. ఆయన సంస్కృతమున ఎన్నో శ్లోకములను రచించెను. మఱియును "హృదయ కుహర"