పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అను శ్లోకమును మొదలు పెట్టినవాడు శ్రీ జగదీశశాస్త్రి. మహర్షి దానిని పూరించెను.

1918 అక్టోబరులో అమ్మనాయనలు సికింద్రాబాదునకు చేరి 1919 డిసెంబరు నెల వరకు అక్కడ నుండిరి. అప్పుడు స్వరాజ్యము కొరకు ఉద్యమము విజృంభించెను. ఆ నాయకులలో గాంధి ప్రబలుడైయుండెను. గాంధి మైత్రేయ ఋషియొక్క అంశమున జన్మించినవాడని నాయన చెప్పుచుండెడివాడు. ఆస్తి విషయములను చక్కబెట్టుకొనుటకు ఆయన కలువఱాయికి పోయి 1920 మే నెల చివర సికింద్రాబాదునకు చేరి 1922 మార్చి వరకు అక్కడనే యుండెను. 1921 జూన్ నెలలో సుధన్వుడు, కపాలిశాస్త్రి నాయన యొద్దకు వచ్చిరి. అప్పుడాయన తన యనుభవములను వారికి చెప్పుచు విఘ్నేశ్వరుని ఉద్దేశించి నాలుగు శ్లోకములను చెప్పెను.

ఆ శ్లోకముల తాత్పర్యము ఇట్లున్నది. "గజాననా! నేను ఘోరతపస్సును చేయకున్నచో అది నీయపరాధమే. నీవు ఏల ప్రేరణ చేయలేదు? నీవు ప్రేరేపించినను నేను తపస్సు చేయలేదన్నచో నీ ప్రేరణకు ఏమి శక్తి యున్నట్లు? నేను కలుషముచే భంగము నొందుచుంటినని మహావిపత్తులో మునుగుచుంటినని ఏల బృంహితధ్వనులను చేసెదవు? నేను నిద్రించుచున్నచో హస్తముతో తట్టి లేపుము. నేను అపమార్గమున పోవుచున్నచో వెంటనే వెనుకకు మరలింపుము. గుహయందున్న యీ చీకటి నేత్రముల శక్తిని హరించుచు నా మార్గమును అరికట్టుచున్నది. చూచుటకు