Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దైవరాతుడు శిష్యుడైన తర్వాత నాయనకు అనంత శాస్త్రితో వాదము జరిగినట్లు "వాసిష్ఠ వైభవము" నందు (17 వ ప్రకరణము - పే. 185) చెప్పబడినది.

దైవరాతుడు వంట మొదలగు పనులను గావించుచు గురువునకు గురుపత్నికి శుశ్రూష చేయుచు రాత్రులందు నాయన యొద్ద కావ్యములను ఉపనిషద్విద్యలను అధ్యయన మొనర్చు చుండెను.

వినయశీలి వేదపండితవంశము వాడును అయిన దైవరాతుడు నిశ్చలభక్తితో గురువును సేవించి అచిరకాలముననే నాయనకు ప్రీతిపాత్రుడయ్యెను. నీడవలె నాయన ననుసరించి మహేంద్రగిరిలో, పడైవీడులో నాయనతోపాటు తపస్సుచేసి అనేక దివ్యాను భూతులను పొందెను.

శ్రీ రమణ భగవానుని ప్రథమ దర్శనముననే భక్తి ఉప్పొంగగా దైవరాతునినోట వెలువడిన శ్లోకములే "రమణవిభక్త్యష్టకముగా" ప్రసిద్ధి గాంచినవి. నాయన రచించిన శ్రీ రమణగీతయందు మూడవ ప్రకరణమున దైవరాతుని ప్రశ్నలు భగవాన్ ప్రత్యుత్తరములు కూర్పబడియున్నవి.

పడైవీడులో తపస్సమాధిలో నున్న దైవరాతుని వాక్కు నుండి నూతన మంత్రములు వెలువడ సాగినవి. నాయనకు అవి స్పష్టముగా వినిపించెను. పదునాఱు దినములలో నాలుగు వందల