వాసిష్ఠుడు మరల పడైవీడునకు పోయి 40 దినములు తపస్సు చేసెను. దీక్షాంతము నందు 200 మంది చేటికలతో కూడియున్న రేణుకా దేవిని ఆయన దర్శించెను. తన శరీరము నందు ఆమె నూతన శక్తిని ప్రసరింప జేసినట్లు, కుమారస్వామి హస్త మందున్న శక్తి అను నాయుధమును తనకు ఒసంగినట్లును ఆయనకు అనుభవము కలిగెను. తరువాత ఆయనకు ఋగ్వేదములోని యస్త్రవిద్యా మహామంత్రము గోచరించెను. అది రేణుకా పరశురాముల యనుగ్రహము వలన సంభవించెనని, వేదసూక్త హృదయములను భేదించుటకు అధికారము కూడ తనకు కలిగెనని ఆయన తలంచెను.
పడైవీడు నుండి వాసిష్ఠుడు వేలూరునకు వచ్చి ఆ యస్త్ర మంత్రము ఉపదేశించుచు శిష్య సంఘమును ప్రబల చేసెను. అది వేద సంఘముగా, ఇంద్ర సంఘముగా ప్రసిద్ధ మయ్యెను. దానిని విప్లవ సంఘముగా ప్రభుత్వాధికారులు భావించి, ఆయనను బంధించుటకు ప్రయత్నించిరి. వెంటనే ఆయన షరాయిని టోపీని ధరించి విద్యార్థి వేషములో 'హంపి' కి బయలుదేరెను. హోస్పేటలో ఒక దొంగ యొక్క వంచనము వలన ఆయన ఒక రాత్రి ఖైదులో నుంచబడెను. మఱునాడు పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆయన వృత్తాంతమును అడిగి తెలిసికొని విడిపించి మంత్ర దీక్షను పొంది శిష్యుడయ్యెను. అతని సాయమున ఆయన హంపికి చేరి అక్కడ తపస్సు చేయుటకు బుద్ది పుట్టక 'మాఉళి' అను క్షేత్రము నందు తపస్సునకు ఉపక్రమించెను. అక్కడ ఒక నెల అనంతరము ఆ క్షేత్ర దేవత మూడేండ్ల బాలికగా సాక్షాత్కరించి "అస్త్ర విద్యా సిద్ధికి