పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలము పక్వము కాలేదు" అని మాయ మయ్యెను. ఆమె యాదేశముగా భావించి అప్పటి నుండి ఆయన విరాణ్మహా మంత్రమును పెక్కుమందికి ఉపదేశించి వ్యాపింప జేయుట, వేద సూక్తములను పరిశోధించుట తనకు జీవిత లక్ష్యములనుగా భావింప జొచ్చెను.

మాఉళి నుండి వేలూరుమీదుగా నాయన తిరువణ్ణామలై వచ్చి రమణుని దర్శించెను. అక్కడ తన శిష్యులు మరల చూత గుహలో వుండుడని నాయనను కోరిరి. "ఉమా సహస్రమును మరల నిర్మించిన తరువాతగాని నేను ఆ గుహలో ప్రవేశింపను" అని శపథముచేసి నాయన వేలూరుకు వచ్చెను. అక్కడ రెండు నెలలు విశ్రాంతి తీసికొని శివరామ శాస్త్రిని పిలిపించుకొని వానితో దక్షిణ యాత్రకు బయలు దేరెను. కన్యాకుమారి, శుచీంద్రము, రామేశ్వరము మొదలగు క్షేత్రములను సేవించుచు జంబుకేశ్వరము చేరి శివరామ శాస్త్రిని ఇంటికి పంపి, అచ్చట అఖిలాండేశ్వరిని గూర్చి పది దినములు ఆయన ధ్యానించెను. పిదప ఆయన ఉమాస్తుతిని మరల రచింప నారంభించెను. ఎంత ఆలోచించినను 700 శ్లోకములకు పైన జరుగ లేదు. ఈ సప్తశతిని ఆయన శిష్యుని ద్వారా మహర్షి యొద్దకు పంపెను. అచ్చటనుండి ఆయన తిరువొత్తియూరు, చిదంబరము, పక్షితీర్థము, తిరుత్తణిని దర్శించెను. అక్కడనుండి ఆయన వేలూరునకు వచ్చి 1910 ఫిబ్రవరిలో కుమారునకు ఉపనయన మొనర్చెను.

1910 ఏప్రిలులో పంచాపకేశశాస్త్రి వేలూరునకువచ్చి నాయనను చెన్నపురికి ఆహ్వానించెను. కాని నాయన ముందుగా భార్యా