Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శక్తి గలిగి చూచిన వారెవరైనా వుండి వుంటే ధన్యులు. ఆ క్షణంలో మానవులెవ్వరూ లేరక్కడ. మహాసిద్ధపురుషులు, అర్ధనారీశ్వరుడు మిగిలిన దేవాది బృందములుండి వుండవచ్చును. అ తర్వాత క్షణాలలో వచ్చాడు పళనిస్వామి. నివ్వెరపోయాడు.

నిశ్శబ్దమునుండి శబ్దము మంద్రస్వరముగా వెలువడింది. శబ్దజాలమయమున కాలవాలముగా పిలువబడిన (నాయన) శబ్దము నిశ్శబ్దముగా నిలిచిపోయింది. శబ్దము నిశ్శబ్దమునుండి శబ్దమును వెలువరింపజేస్తే ఆ నిశ్శబ్దమునుండి వెలువడిన శబ్దము, శబ్దమయమును నిశ్శబ్ద మొనరించినది.

అంతకుముందు అరుణాలేశ్వరుని రథమాగి "నాయన" రాకతోనే కదలుట ఆ వూరివారందరికి తెలిసినదే. ఇప్పుడు బ్రాహ్మణ, మౌనస్వామి నోటినుండి శబ్దము వెలువడుట.

ఇది నాయన. భగవాన్ చరిత్రలలో ముడివేసుకొని, పెనవేసుకు పోయిన మధురాను బంధమనోహర మధురస్మృతి.

నాయన ఆ స్వామికి "భగవాన్ రమణ మహర్షి" అని నామకరణం చేశారు. అందరినీ "భగవాన్" అని పిలిచి అనుగ్రహములు పొంది తరించమన్నారు. కాని, స్వార్థచింతనతో తన కెందుకులే అని అనుకోలేదు. మామూలు మానవుడు నా కెందుకులే అని అనేక విషయాలలో స్వార్థచింతనతో సాటి మానవులనుండి తప్పుకొని పోవడానికి యత్నిస్తాడు. కాని మహాత్ములు "మనకందరకూ" అనే విశాల దృక్పథంతో వ్యవహరిస్తారు.

ఆనాడు నాయన నామకరణం చేసివుండకపోతే ఈనాడు మనము "భగవాన్ రమణ మహర్షి" అని తెలుసుకొని, పిలుచుకుంటు వుండగలిగే వారమా? అలాగే భగవాన్ "నాయనా" అని పిలిచి వుండకపోతే మనము నాయనను "నాయన' అని పిలుచుకునేవారమా !