మన ఊహకందని స్థితినందిన నాయన ఏమీలేని, సామాన్యునివలె కన్పించే మౌనస్వామికి సాష్టాంగపడటం, నాయనకే చెల్లిందికానీ, నాలాంటివారికది జన్మజన్మ పరంపరలకు కూడా కలుగదేమో ! ప్రస్తుతము ఈ విషయంలో మన దేశంలోని కొంతమంది తల్లి దండ్రులను, వారిపిల్లలను మనము అభినందించక తప్పదు. జన్మ నిచ్చిన తల్లిదండ్రులకే నమస్కరించుటకు మనస్కరించకపోగా, వారిని చులకనగా చూసే దౌర్భాగ్యపు జాతికి చెందిన వారుండటం, వారికి సరియైన ధర్మ, కర్మాచరణలను నేర్పని తల్లిదండ్రులను చూడటం వలన, బహుశావారు ఈ దేశవాసులు కాని వారేమోననీ, గతిలేక పొట్టకూటికై, అన్నింటినీ అందరినీ ప్రేమ, సమత, మమతలతో యిడుడ్చుకునే హైందవ ధర్మమునకు ఆలవాలమైన భారతమాతకు దత్తు కొడుకులుగా వచ్చినారేమోననీ, అందుకే తల్లిపాలు త్రావి రొమ్ములు గ్రుద్దే ప్రబుద్దులుగా తయారౌతూ - తామేదో దేశానికి లోకానికి సృష్టికి, సంఘానికి సేవలు చేస్తున్నామనే అవివేకముతో డప్పులు వాయించుకుంటూ, పబ్బం గడుపుకునే వారిని అభిశంసించక అభినందించగలమా? అలాంటివారికి మహాత్ముల ప్రవర్తన, నాయన నడక, భగవాన్, సాయినాథ్, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శ్రీ అరవిందుల లాంటి ఎందరెందరో జీవిత చరిత్రలైనా కనులు తెరిపించగలవు. అయినా నా వెఱ్ఱిగానీ వారికి అటువంటి, ఆశ, ఆశయము, ధ్యాస, ధ్యేయములు వుంటేకదా ! అందుకే ఓ సహనశీలి భరతమాతా ! నీకు మమ్మల్నందరినీ సమానంగా భరించక తప్పదు.
అప్పుడు ఆ మౌనస్వామి కంఠమును సవరించుకొని ఒక చిన్న వాక్యములో " మంత్ర నాదమెక్కడ పుడుతుందో చూడ " మని అన్నాడు. అంతే - అదే మరువలేని, మధురాతి మధురమైన క్షణం మనోజ్ఞ మంజుల సుందర సమ్మోహన దృశ్యం. దానిని చూడగలిగే