పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/137

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తంతి వచ్చెను. " మీ రిచ్చిన రెండు టెలిగ్రాములు భగవాన్ తనయొద్ద నుంచుకొని సమాధానము పల్కలేదు." అని ఆ తంతి యందు ఉండెను. నాయన దానిని అందుకొని చించిపారవేసెను.*[1]

శ్రీ రమణాశ్రమము నుండి వచ్చిన తంతిని నాయన చింపి వేయుట ఆశ్చర్యకరము. ఆయన ఎందులకు అట్లు చేసెనో తెలియదు. మహర్షి ఏదైన సందేశమును తనకు అందింపుడని చెప్పి యున్నను ఆశ్రమమువారు అట్లు చేయలేదని ఆయన శంకించి కోపముతో అట్లు చేసియుండునేమో అని యూహింపవలసి యున్నది. లేకున్నచో గురువు దగ్గఱ నుండి వచ్చిన వార్తగల పత్రమును చింపి నాయన అనాదరమును ప్రకటించునా?

అప్పటికే కలువఱాయి నుండి మహాదేవుడు వచ్చియుండెను. ఆఫీసులో ముఖ్యమైన పని యుండుటచే వెంటనే తిరిగిరావచ్చునను తలంపుతో లక్ష్మికాంతము కలకత్తాకు పోయెను. అత్యుష్ణమువలన నాయనకు వారము రోజుల నుండి విరేచనము కాకుండెను. పండ్ల రసము వలన 25 వ తేది శనివారము ఉదయమున అయిదారు విరేచనములు అయి మలమంతయు వెలువడెను. అప్పుడు నాయన తెరపినబడి తేలిక నొందెను.

మధ్యాహ్నము ఒంటి గంటన్నరకు శిష్యులందఱు శనివార హోమమునకు వచ్చిరి. వారు హోమము చేయుచుండగా నాయన మంచము నుండి దిగి వారితోపాటు ఆసనబద్దుడై కూర్చుండెను. తరువాత శిష్యులను పంపి మంచముపై పండుకొని మధ్యాహ్నము రెండున్నర గంటలకు, ఉత్తరీయమునువలె, శరీరమును అనాయాస

  1. * నాయన పుట - 725