గణపతిముని చరిత్ర
113
చనువు వుండెడిదని, ఇద్దఱును కలిసి తపస్సు చేయుచుండెడి వారని, ఆ సమయములో వారు ఎన్నో అవమానములను భరింప వలసి వచ్చెడిదని నాయన పార్వతీశమునకు చెప్పుచుండెడి వాడు. పార్వతీశము నాయన యందు గాడమైన భక్తి కలవాడే అయినప్పటికి ఆతనికి నాయన మాటలు అతిశయోక్తులుగా తోచుచుండెడివి. నాయన స్వర్గస్థుడైన పిదప 1937 లో అతడు తిరువణ్ణామలైకి పోయి రమణ భగవానుని దర్శించెను. నాయన చెప్పినదంతయు నిజమేనా అని భగవానుని అడుగ వలయునని అతడు తలంచు చుండెను. కాని అడుగ లేదు. భగవానుడు చుట్టున్న వున్న భక్తు లందఱను కలయ జూచి ఒక్క క్షణము అతని వైపు నిశితముగా చూచి సొరుగులో నుండి ఒక పుస్తకమును తీసి తెఱచి చూపెను. ఆ పుటలో కూర్చుండియున్న నాయన బొమ్మ వున్నది. ఆ బొమ్మను చూపుచు భగవాను డిట్లనెను. "ఇది నాతోకూడి తపస్సు చేయుచు ఎన్నియో అవమానములను పొందిన మహనీయుడగు నాయన యొక్క బొమ్మ, ఆకలి యైనప్పుడు మేము కొన్ని సమయములలో అగ్రహారము లోనికి భిక్ష కొఱకు పోవుచుంటిమి. ఒక్కొక్కప్పుడు జాలిగల తల్లులు ఏదైన పెట్టుచుండెడి వారు. ఇంకొకప్పుడు తిట్టి తఱుముచుండెడి వారు."
" This is the picture of Nayana, a great soul who did tapasya with me and suffered several indignities. Some times when we would feel hungry, we would go to the Agraharam for alms. Some times a kind hearted mother would give us some thing to eat, but at other times they would drive us away hurling abuses."