పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/130

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
112
గణపతిముని చరుత్ర

ప్రదర్శించలేదు...శిష్యులు ఆప్తులు ఈ విద్య చూడ ఇచ్చగించినప్పుడు ఎక్కడైనా ఒక్క నాణెం వారు సృజించి వారికి చూపారేమో......యీ విద్వుద్వ్యయం (నాణెము బంగారముగా మారునప్పుడు శరీరములోని విద్యుచ్ఛక్తి కొంత వ్యయమగును) శరీరమును కాల్చేటంతటి క్షోభ కలుగ జేస్తుంది......"

పై లేఖలో కుండలీకరణములలో ఉన్నమాటలు నేను చేర్చినవి.

పార్వతీశము యొక్క బావమఱది కృష్ణరావు పదియేండ్ల వయస్సులో ఆ సమయమున ఆరవ తరగతి చదువుచు బావగారి యింటిలో ఉండేను. అప్పుడు నాయనతో తనకు కలిగిన యనుభవములను స్మరించుచు అతడు ఇటీవల నాయనను గూర్చి ఆంగ్లవ్యాసమును భారతీయ విద్యాభవనము వారిపత్రికలో ప్రకటించెను.*[1]

ఒకనాడు అక్క కృష్ణరావును శిక్షించుచు ఇంటినుండి గెంటివేసి తలుపు గడియ వైచెను. కృష్ణరావు తలుపును తట్టుచు ఏడ్చుచుండెను. నాయన తలుపు తీసి అతనిని కౌగిలించుకొని కన్నీళ్ళు తుడిచి ఆమెను పిలిచి, "అమ్మా! పిల్లవానిని ఇంతగా శిక్షించుట తగదు. వీడే ఒకనాటికి మంచి వాడగును" అని చెప్పి అతనిని ఓదార్చెను.

కృష్ణారావు బావగారికి కలిగిన యొక అనుభవమును కూడ అ వ్యాసములో వివరించినాడు. రమణ భగవానునితో తనకు చాల

  1. * Bhavan's Journal Vol, 32, No. 9, Dec. 15-1985-NAYANA THE SAINT- A.K. Rao