Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గణపతిముని చరిత్ర

111

చూచుటకు కుతూహలపడిరి. ఆ రాత్రి నాయన అందరు చూచు చుండగా ఒక అర్ధణాకాసుకు (ఇది అప్పుడు రూపాయి సైజులో ఉండెడిది) తన చెమటను పట్టించెను. అది మొదట మాడినట్లుగా ఉండి క్రమముగా పసుపురంగును పొంది బంగారముగా అయ్యెను. అప్పుడీ యోగసిద్దిని లక్ష్మికాంతము ప్రసాదరావు మొదలుగా అనేకులు స్పష్టముగా చూచిరి. ఆ నాణెము కొఱకు వారిలో ఆశ కలుగుటను చూచి నాయన ఆ కాసును లక్ష్మికాంతముచేత డొంకలో విసిరివేయించెను.*[1]

శ్రీ బి.ఎస్. రామారావు నాకు 21-4-91 తేది వ్రాసిన లేఖలో ఈ సందర్భమును ఇట్లు వివరించెను. " ఆ coin (నాణెము) యిచ్చింది నేనే. ప్రతిరోజు వారికి (నాయనకు) మధ్యాహ్నం apple (ఆపిల్ పండు) తెచ్చియివ్వటం నావిధి. ఆనాడు apple పండు కొన్నప్పుడు రెండు అణాల బిళ్ళ యిస్తే విక్టోరియా (బొమ్మ ఉన్న) అర్దణా pure copper (స్వచ్ఛమైన రాగి) వచ్చింది. వారు పండుకై చేయి జాపారు. పండుతో ఆ coin (నాణెము) వారి చేతిలో విడిచాను. వారు పరధ్యానంగా మాట్లాడుతూ మరచి పోయారు కబుర్లు చెపుతూ. అరగంటతర్వాత Mrs. Kantham (లక్ష్మికాంతముగారి భార్య) పండు అడిగి తీసుకుంది. క్రిందనున్న coin రంగు మారింది - స్వర్ణం వైపు. వారు చకితులై మంచం మీదనుంచి దిగి- "ఛీ! పిశాచీ" అని ఆ Coin ను Drain Pipe (gutter మురుగు కాలువ) లో జారవిడచి నన్ను మందలింపు చూపే చిఱునవ్వుతో సత్కరించారు. వారు ఎప్పుడూ ఈ విద్యను

  1. * నాయన-పుటలు 700, 701