పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

గణపతిముని చరిత్ర

ణము సరసముగా సాగెను. స్వామివారు చాలా సంతోషించి తగినట్లుగా సత్కరించిరి.[1]

1-9-1935 తేది వినాయక చతుర్థియందు నాయననే విఘ్నేశ్వరునిగా ఫీఠము పైనుంచి భక్తులు కొందఱు షోడశోపచార పూజలను చేయవలయునని అభిలషించిరి. వారి యుత్సాహమును భంగపఱచుటకు ఇష్టములేక నాయన తనకు ఇష్టము కాకున్నను అందులకు అంగీకరించెను. మహోత్సవముగా భక్తులు నాయనను గణపతినిగా పూజించిరి. అలవాటు చొప్పున పురోహితుడు ఉద్వాసన మంత్రములను కూడ పఠించెను. నాయనకు నవ్వువచ్చెను. కాని అది అపశకునమే అయ్యెను.

తరువాత కొన్ని దినములకు నాయన మనుమని బాలసారె కొఱకు కలువఱాయికి పోయెను. అప్పుడు ఆయన చేతియందు యాదృచ్చికముగా చేరిన రాగి నాణెము స్వవర్ణముగా మాఱెను. అప్పటికి రేణుకాదేవి ఆజ్ఞాపించిన దీక్షను పొందుటకు అర్హత కలిగిన దని నాయన సంతసించెను. 21-9-35 తేది నాయన మరల ఖడ్గపురమున పార్వతీశముయొక్క ఇంటికి చేరెను. నాయన తపస్సుకొఱకు ఒక యాశ్రమమును నిర్మింపదలచి అక్కడి భక్తులు డిసెంబరులో నాయనచే దానికి శంకుస్థాపన చేయించిరి. అంతవరకు గుట్టుగా నుంచబడిన స్వర్ణసిద్దిని ప్రసంగవశమున నాయన వెల్లడి చేసెను. పార్వతీశము మొదలగువారు ఆ మహిమను

  1. పండిత గోపదేవ ఆత్మచరితము-గోపదేవ్ Printed by ఆర్య సమాజము కూచిపూడి-1983-పుటలు 164, 165, 166