Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంభీర్యము నిచ్చు కనుబొమలు, సన్నని మీసము, పలుచగా వ్రేలాడు చిన్న గడ్డము గల నాయన యాకృతి గతయుగమునకు చెందిన ఋష్యాకృతి నెట్టివారికైన స్మరణకు దెచ్చుచుండెడిది. పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు గూడ నాయనను జూచుసరికి పేరునకు తగినట్లు పితృభావము స్ఫురించి, బిడ్డలవలె శరణు బొందుటకు చిత్తము ప్రేరేపించుట యామూర్తి విశేషము. అందుల కనుగుణముగా నాయన చూపునందేగాక యావత్తు ముఖవికాసము నందు వెల్లువలైనట్లు వాత్సల్యానుకంపము లవ్యాజముగా నుట్టి పడుచుండెడివి. ఇక కంఠము విప్పినచో ఘంటానాదము ద్వనించి, సత్యప్రకర్షతో గూడి అధికారయుతమైనను మధురరస పూరితములగు మాటలు వెడలి హృదయ సమావర్జన మొనర్చుచుండెడివి. ఆ యోజస్సునందు గౌరవముతోపాటు చనువు బుట్టించు విశేష ముండెడిది. చిఱునవ్వు మాటిమాటికి వెల్లివిరిసి, కలకల ద్వనులతో గిలిగింతలు పెట్టుచున్నట్లుండి సంతోషమును వ్యాప్తిజేయు చుండెడిది".....[1]

ఇట్టి మనోహరమైన యాకృతి గోపదేవు నాకర్షించుటలో ఆశ్చర్యములేదు. నాయన గోపదేవుని మిగుల నాదరించి, అతని యభ్యర్థనము ననుసరించి అతనితో స్వామివారి యొద్దకు పోయెను. అక్కడ నాయన భక్తి శ్రద్దలతో పీఠమునకు స్వామివారికి దండ ప్రణామము లాచరించి సంస్కృతములో వారిని స్తుతించెను. స్వామివారుకూడ నాయనను చక్కగా నాదరించిరి. వారికిరువురకు నాలుగు గడియలు (96 నిముసములు) సంస్కృతమున సంభాష

  1. * నాయన పుట 728, 729