Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూక్ష్మశక్తి యొక్క కాంతి మూడు మైళ్ళవరకు చూడగలిగితినే కాని ఆ వెనుక ఎంతవరకు వ్యాపించినదో చూడలేక పోతిననీ, బుద్దుడు మొదలయిన వారిదెవ్వరిదీ ఇంత దూరం వ్యాపించ లేదనీ చెప్పినట్లుగా భగవత్సన్నిధిలో నివేదించారు.'[1] ఇట్టి యభిప్రాయములు రమణ భక్తులలో ప్రబలముగా నున్నప్పుడు వారు వాసిష్ఠుని యెడ ఆయన శిష్యుల విషయమున అసంతుష్టులై యుండుట సహజము.

ఆగష్టు 15 శ్రీఅరవిందుని జయంతి. నాయన అక్కడికి చేరునప్పటికి భక్తులు, ఆశ్రమ వాసులు శ్రీఅరవిందుని దర్శించుట ముగిసెను. నాయన రాక ముందుగానే తెలియుటచే శ్రీమాత శ్రీఅరవిందులు ఒక గదిలో కూర్చుండి యుండిరి. రెండు నిముసములు నాయన శ్రీఅరవిందుడు పరస్పరము చూచుకొనిరి. నాయన గజాననాంశ సంభవుడని శ్రీఅరవిందుడు. శ్రీఅరవిందుడు అద్బుత శక్తి తేజము కలవాడని నాయనయు అనుకొనిరి. పిమ్మట శ్రీమాత నాయనతో కూడ ధ్యానము చేయగోరెను. అట్లు వారు ముప్పావు గంట ధ్యానించిరి. 'నాయన నిశ్చయముగ గొప్ప యోగి' అని శ్రీమాత కపాలి శాస్త్రితో చెప్పెను. నాయన పుదుచ్చేరిలో ఒక వారముండెను. అప్పుడు ఆయన "జనని" అను గ్రంథమునకు పీఠికను, 108 సూత్రములతో "తత్త్వాను శాసన" మును రచించెను. రెండును శ్రీఅరవిందుని మెప్పును పొందెను.

నాయన తిరువణ్ణామలైకి తిరిగి వచ్చి డిసెంబరులో ఇంద్ర స్తోత్రమును రచించెను. ఈ సమయమున పొన్నుస్వామి అయ్యరు

  1. * శ్రీ రమణాశ్రమ లేఖలు 53 స్వప్నాలు భ్రాంతులు పుట 95.