పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/104

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సందర్శించుటకు గాని, యతనికి నమస్కరించి యతని యాశీస్సు బడయుటకు కాని నాయన మనస్సు శంకించలేదు."[1]

ఇక్కడ ఒక విషయమును మనము పరిశీలింపవలసి యున్నది. నాయన పై యభిప్రాయములను శిష్యులతో ఇతరులతో అప్పుడప్పుడు వ్యక్తీకరించి యుండును. లేకున్నచో శ్రీ లక్ష్మీకాంతము పై విధముగా వ్రాయుటకు అవకాశము లేదు. ఇట్టి యభిప్రాయములను గూర్చి మహర్షి ఏమియు అనుకొనక పోయినను, ఆయన యొక్క భక్తులు అనుకొనుట అసహజము కాదు. మహర్షి మహాత్ముడు. మహాత్ముని భక్తులందఱు మహాత్ములై యుండరు. 'భగవానుడా! మాకు ఎవరును శరణము లేరు. మీరే మాకు శరణము. మమ్ము రక్షింపుడు. ఉద్ధరింపుడు' అని రమణుని ఆశ్రయించి యున్న భక్తులకు ఆయనకంటె అధికుడుగా గాని, సమానుడుగాగాని అప్పుడే ఒక డున్నాడు అని తలంచుట ఇష్టమై యుండదు. అట్లు తలంచుట అపరాధముగా కూడ అనేకులు తలంప వచ్చును. ఇది సంకుచిత భావము కావచ్చును. కాని అందఱు విశాల భావములు కలిగి యుండుట సంభవము కాదు. సూరి నాగమ్మ వ్రాసిన ఈ క్రింది విషయమునుబట్టి రమణునకు శ్రీఅరవిందునకుగల యంతరమును గూర్చి రమణ భక్తులు ఎట్లు గ్రహించు చుండిరో మనము గ్రహింప వచ్చును. 'ఈ మధ్య ఒకరు తమ స్నేహితులు సూక్ష్మశక్తి పరిణామములు చూడగలవా రున్నారనీ, వారు మహాపురుషుల సూక్ష్మశక్తి పరిణామాలు చూచారనీ, అందులో శ్రీఅరవిందుల సూక్ష్మశక్తి కాంతి ఏడు ఫర్లాంగుల దూరం వ్యాపించిందనీ, భగవాన్

  1. * నాయన - పుట - 591