అను శిష్యుడు వాసిష్ఠుని యొద్దకువచ్చి తన్ను శ్రీమాత అనుగ్రహించి శ్రీఅరవిందాశ్రమమున చేర్చుకొనునట్లుగా లేఖ వ్రాసి ఇమ్మని ప్రార్థించెను. వాసిష్ఠుడు ఆమెకు ఇట్లు వ్రాసెను.
"భగవతీ! శ్రీమాతా!
దురదృష్ట వశమున నేను దూరమున నున్నను, నా మనస్సుచే నీ పాదములను స్పృశించుచునే యుంటిని. నాజీవిత యాత్రలో ధన్యతమమైన దివసమందు నీ తేజస్సెట్టిది చూడబడెనో అది మోహమును ఖండించు అంత:ప్రభ నా కిచ్చుగాక! నీ పుత్రుడు దూరముగా నుండెనని యుపేక్షింప వలదు. బహు సంవత్సరముల నుండి నీ చరణములను ధరించిన నే నెచ్చట నున్నను నీ సాన్నిధ్య మందున్నట్లెంచి యనుగ్రహించ వలెను.
మఱియొక మనవి. శ్రీఅరవిందుని యందు భక్తి గలవాడును, శ్రీమాతయందు దృడ విశ్వాసము గలవాడును, నాకు శిష్యుడును అయిన పొన్నుస్వామి అయ్యరు అభ్యనుజ్ఞను బొందుటచే ఈ పత్రము నీ జనుడు వ్రాసికొనెను. వానికి అభ్యనుజ్ఞ నిచ్చుటకు నీవు తగుదువు. వాడు ధన్యుడగు గాక.[1]
ఇట్లు,
నీ నిత్య భక్తుడు, హృదయ పుత్రుడు
వాసిష్ఠ గణపతి.
- ↑ * నాయన - పుటలు 602, 603. వాసిష్ఠ వైభవము - ఉత్తర భాగము ప్రకరణము - 4