పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

93

మునిపల్లె

కై ఫియ్యతు మౌజే మునిపల్లి సంతు పొంన్నూరు సర్కారు ముత్తు౯ జాంన్నగరు

తాలూకే చిల్కలూరిపాడు

పూర్వము ద్వాపర యుగ మంద్దు యిది మహత్తైన దండకారణ్యమయినంద్ను యీ స్థళమంద్దు అనేక మయ్ని రుషుల తోటి అగస్త్య మహాముని వశియించ్చి సదాశివుని ధ్యానం చేశే వర్కు అతని అభిప్రాయము తెలిశి యీశ్వరుడు స్వయం వ్యక్తమయ్ని లింగ్గ స్వరూపంగ్గా భూమిలో నుంచ్చి అవతరించ్చిరి గన్కు ఆగస్త్యులు ఆ లింగ్గమూర్తి౯ని ప్రతిష్ఠి చేశినారు. తదనంత్తరం రుషి బృందములు యీ సదాశివుని పూజిస్తూ వణ౯ కుటీరములు కల్పన చేస్కుని వాసం చేశినారు గన్కు మునిపల్లి అనే పేరు వచ్చినది. అగస్త్యుల వల్ల నుంచ్చిన్నీ ప్రతిష్ఠ చెయ్యబడ్డంద్ను యీ లింగమూర్తి౯కి అగస్తేశ్వరుడు అని నామాంకితము యేర్పడ్డది.

కలియుగ ప్రవేశమయిన తర్వాతను అరణ్యములు భేదించ్చబడి గ్రామములుగా యేప౯డే కాలమంద్దు యిక్కడ గ్రామం యేప౯డి పూర్వ ప్రకారంగ్గానే మునిపల్లె అనెవాడికె వచ్చినది.

శాలివాహన శక ప్రవేశమయ్ని తర్వాతను కొన్ని దినముల్కు అప్పుడు రాజ్యం చేశే రాజులు ధర్మవంత్తులు గన్కు యీ స్థలం పూర్వోత్తరం విచారించ్చి యీ లింగ్డమూర్తి౯కి ఆలయం కట్టించ్చి వుత్సవాదులు జర్గించ్చినారు. గజపతి శింహ్వాసనస్తుడైన గణపతి మహా రాజులుంగారు శా ౧౦౫౬ (1134 AD) శక మంద్దు పట్టాభిషిక్తుడై రాజ్యం చేశే యడల వీరి దగ్గర మహా ప్రధానియైన గోపరాజు రామంన్న గారు బ్రాంహ్మణుల్కు గ్రామ మిరాశిలు వ్రాయించి యిచ్చే యడల యీ మునిపల్లెకు యజుశ్యాఖాద్యాయకుడుంన్నూ కణాస గోత్రోద్భవులుంన్నూ అయ్ని ఆరువేల నియ్యోగికి ఏకభాగంగ్గా కరిణీకం మిరాశీ నిన౯ యించ్చినారు గన్కు తదారభ్య మునిపల్లెవారనే గ్రామ నామాలై వుంటూ వచ్చిరి. సదరహి వ్రాశ్ని ఆగస్త్య రాజు మిరాశిలో ప్రవేశించ్చి అగస్తేశ్వర స్వామికి భక్తుడై స్వామి ప్రసాదము చాతను దినదిన ప్రవధ౯మానుడై భాగ్యవంత్తుడై వుండి గ్రామం బశ్తీ చేసి యీ గ్రామమంద్దు చతుధి౯క్కుల ౬౦ ఆకుతోటలు వేయించ్చి శ్రీ ఆగస్తేశ్వర స్వామి వారి ఆలయం జీనో౯ద్ధారం చేయించి గభ౯ గుడి అంతరాశికములు మంటపములు కట్టించ్చి ఆందోళకాళ్వ వాహన ప్రాప్తిని పొంద్ది వుండ్డే యడల పయ్ని వ్రాశ్ని అగస్త్యరాజు భార్య అయ్ని పళ్ళంమ్మ యీ గ్రామంలో వుంన్న ఆకు తోటలు చుచే నిమిత్తం పల్లకీ నవారి అయి