పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

గ్రామ కైఫియ్యత్తులు


బయలుదేరి వస్తూ వుండ్డగా సదరహి ఆకుతోటలు చేశే కాపు పళ్ళంమ్మకు గ ౬౦ వరహాలుంన్నూ ఆరువై చీరలుంన్నూ కట్నాలు యిచ్చిరి గన్కు ఆమె ఆ వరహాలు తెచ్చి అగస్తేశ్వర స్వామి వారి కిరీటాన్కు బంగ్గారు నీరు చేయించ్నిది. ఆ కిరీటం యిప్పుడు వుంన్నది.

తదనంతరం రెడ్లు ప్రభుత్వం చేశే కాలమంద్దు గ్రామస్తులు గ్రామ మధ్యమంద్దు విష్ణు స్తలం కట్టించ్చి పంన్నీద్దరు ఆశ్వారాదులను వుంచ్చి చంన్న కేశవస్వామి వార్ని ప్రతిష్ఠ చేశి సదరహి అగ సైశ్వర స్వామి వార్కింన్నీ చంన్నకేశవస్వామి వార్కింన్నీ పుత్సవములు జర్గించుకుంటూ వుండ్డిరి.

రెడ్డివడ్డె అధికారములు గడ్చి కనా౯ట్క ప్రభుత్వము వచ్చి కృష్ణరాయలు రాజ్యము చేశేటప్పుడు స్వస్తిశ్రీ శాలివాహన శక వరుషంబ్బులు ౮౪౪౬ (1524 AD) అగునేటి తారణ సంవత్సర మార్గశిర శు (శుద్ధ) ౧౦ లు సోమవారం స్వస్తి సమస్తభువనాధీశ్వరుండైన ముని పల్లె అగస్తేశ్వరునికి గభే౯శ్వర మహాపాతృని కొమారుడు తిరుమలయ సాష్టాంగ్గ దంణ్నములు సమప్పిం౯చ్చి యిచ్చిన ధర్మశాసనం మాకు కొండ్డవీటి శీమలోను తింమ్మర్సు అయ్యవారు వుంమ్ముడి పాలించ్చి నవ ధరించ్ని మునిపల్లెకు దక్షిణాన తాడిపత్తి౯ చర్పు పడమటి మామిళ్ళు వుశిరికలు మొదలయ్ని తోట ఫలముల వల్ల వచ్చిన ఆదాయము నిత్య మహోత్సవాన్కు సాలీనా పనుల్కు సమప౯ణ చేశి పూర్వం నుంచ్చీ జర్గుతూ వుండ్డే క్షేత్రాలు బోడపాట్ని బ ౧ వెల్లటూరి పొలిమేరను ఖ ౦౹౦ యీ క్షేత్రములు జర్గించ్చినారు కనా౯ట్క ప్రభుత్వం వర్కు నడ్చి తదనంత్తరం మొగలాయి వచ్చెను. గన్కు సదరహి వృత్తులు జర్గలేదు. కొండ్డవీటి శీమ సముతు బంద్ధీలు చేశే యడల యీ గ్రామం పొంన్నూరు సముతులో చేర్నిది. గన్కు సముతు అమీలు చౌదరు దేశపాండ్యాల పరంగ్గా చాలాదినములు అమాని మామ్లియ్యతు జర్గినది. ఆ దినములలో మజ్కురి కరణమయిన కొండ్రాజు అగస్తేశ్వర స్వామి కిరీటం చేయించ్చి దాని మీద తన పేరు విలాసం చెక్కించ్చుకుంన్నాడు.

స్న ౧౧౨౨ ఫసలీలో (1712 AD) కొండ్డవీటి శీమ జమీదాల్ల౯కాకు మూడు వంట్లు చేసి పంచ్చిపెట్టే యడల యీ గ్రామం వెంక్కంన్నా మజుందారి గారి తాలూకాలో దాఖలు అయినది గన్కు వెంక్కంన్న పంత్తులు గారు తాలూకా ప్రభుత్వాన్కు దక్షులై అధికారం చేయిస్తూ యిచ్చిన మాన్యాలు

కు ౧ మజ్కూరీలో పున్న దేవస్తానముల్కు మొగలాయి అమానిలో నిన౯యించ్చిరి.
కు ౦ ౺ ౦ శ్రీ అగ స్తేశ్వర స్వామి వారికి
కు ౦ ౺ ౦ శ్రీ చన్న కేశవస్వామి వారికి