పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

గ్రామ కైఫియ్యత్తులు


వింపజేసినంద్ను హయగ్రీవునింగారు మజుకూరు కోటలో వుండ్డి వెంక్కట కృష్ణునింగారి వ్యవహారము ప్రబలంగ్గా జర్గిస్తూ అప్పట్లో అగస్తేశ్వర చంన్నకేశవస్వామి వాల్ల౯కు ఆలయములు కట్టించ్చి స్వామి వాల్ల౯ను సంప్రోక్షణ చేయించ్చి యీ స్వామి వాల్ల౯కు నిత్య నైవేద్య దీపారాధనల్కు జరగగలంద్దుల్కు

కు ౦ ౻ = శ్రీ అగస్తేశ్వర స్వామి వారికి
కు ౦ ౻ = శ్రీ చన్న కేశవస్వామి వాల్లకు
—————————
కు ౧ ౺ =
—————————

ప్రభుత్వం చేశ్ని తర్వాతను వెంక్కట కృష్ణునింగ్గారి కుమారులయ్ని నర్సంన్నరావు గారు ప్రభుత్వాన్కు వచ్చి అధికారం చేస్తూ వుండ్డగా మృత్తు౯ జాంన్నగరు సర్కారుకు మంన్నెవారయ్ని మాణిక్యరావు తిరుపతి రాయునింగ్గారు హెవలంబి సంవత్సర పుష్య శు ౧ ల రోజ్ను యీ గ్రామం మీదను పదాపు పడి కోట తీసుకొని గ్రామం దరోబస్తు దొచ్కొని కోట పడగొట్టి వేయించ్చిపోయినారు. శార్వరి సంస్వత్సర మంద్దు వెంక్కటేశం గారు తాలూకా చేరి సఖంగ్గా పంచ్చుకుంన్న తర్వాతను వెలుగుండం వారికి కొంన్ని ద్నిములు గ్రామం మనవర్తి౯ క్రింద జరిగించ్చి యిటు తరువాతను గ్రామం మనవత్తి౯ యివ్వకను యీ గ్రామంలో పూర్వం వెంక్కంన్న పంత్తులు గారి నాటి నుంచ్చి వుంన్న తన సావరము పొలంలో కు ౧౦ న్ను వారి క్రిందనే వుంచ్చి మామూలు ప్రకారం జరిగిస్తూ వుంన్నారు. అంత్తట నుంచింన్ని గ్రామంలో వుండే మిరాశీదాలు౯ జిరాయితీ చేసె రహితు (రైతు) వల్లను వ్యవహారం జర్గించ్చి ఆనంద్ద నామ సంవత్సరం వర్కు ప్రభుత్వం చేశినారు. తదనంత్తరం వెంక్కటేశం గారి కొమారులయ్ని వెంక్కట రమణయ్య రాయినింగ్గారు ఆ సంవ్వత్సరమంద్దె ప్రభుత్వాన్కి వచ్చి వ్యవహారం చేసుకొంటూ మజ్కూరులో వుంన్న శివకేశవుల్కు పూర్వ ప్రకారమే యినాములు జర్గిస్తూ నిత్య నైవేద్య దీపారాధనల్కు జరిగిస్తూ వుంన్నారు.

ఆ. న. ౧౮౧౨ (1812 AD) సంవత్సరం నవంబ్బరు ది ౧౫ తేది అంగ్గీరస నామ సంవత్సర కార్తీక శుద్ధ ౧౧ లు ఆదివారము .