పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

మన్నవ

కయిఫియ్యతు మంన్నవ సంతు పొంన్నూరు సర్కారు ముత్తు౯జాంన్నగరు

తాలూకే రాచూరు యిలాకే రాజా మల్రాజు వెంక్కట గుండ్డారావు.

యీ గ్రామాన్కు వూర్వం నుంచ్చింన్ని మన్నవ అనే పేరు వుంన్నది.

కుళోత్తుంగ చోళ మహారాజులుంగారు శాలివాహనం ౧౦౩౯ శక (1117 AD) మందు పట్టాభిషిక్తుడై రాజ్యం చేశేటప్పుడు యీ గ్రామం పొంన్నూరు భావనారాయణస్వామి వారికి అగ్రహారం యిచ్చినాడు గన్కు కొన్ని దినములు జరిగెను.

గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగారు శాలివాహనం ౧౦౫౬ శకం ( 1134 AD) లగాయతు రాజ్యం చేస్తూ వుండ్డగా వీరి ప్రధానులయ్ని గోపరాజు రామంన్న గారు ధర్మసంస్థాపనాథ౯మై శాలివాహనం ౧౦౬२ (1145 AD) ఆగునేటి రక్తాక్షి సంవత్సర భాద్రపద బహుళ 30 అంగ్గార్కవారం సూర్యగ్రహణ కాలమంద్దు ప్రభువు దగ్గర సూర్యగ్రహణ కాలమంద్దు ప్రభువు దగ్గిర దానం బట్టి సమస్తమయ్ని నియ్యోగుల్కు గ్రామ మిరాశీలు నిన౯యించ్చె యడల యీ గ్రామాన్కు గౌతమ గోతృడయ్ని తల్లప్పకు ఏకభోగంగ్గా గ్రామ మిరాశి యిచ్చినారు గన్కు యెతద్వంశజులైన వారు తధారభ్యామంన్నవ వారనేయింటి పేరు కల్గి గ్రామ కరణీకపు మిరాశీ అనుభవిస్తూ వున్నారు సదరహి గజపతి గారి ప్రభుత్వము లోనే మజ్కూరు శ్రీ చన్న కేశవ స్వామి వారికి ఆలయం కట్టించ్చి శ్రీ స్వామి వార్ని ప్రతిష్ఠ చేశినారు గన్కు నిత్య నైవేక్య దీపారాధనలు మొదలయ్ని వుత్సవాదులు విశేషంగ్గానే జర్గిస్తూ వచ్చినారు తదనంత్తరం రెడ్లు ప్రభువులై రాజ్యం చేశేటప్పుడు యీ గ్రామాన్కు వుత్తర భాగ మంద్దు శివస్తలం కట్టించ్చి శ్రీ సోమేశ్వరస్వామి వారనే లింగ్డమూత్తి౯ ప్రతిష్ఠ చేసినారు. వడ్డెరెడ్డి కనా౯టక ప్రభుత్వములు శాలివాహనం ౧౫౦౦ శకం (1578 AD) వర్కు జర్గిన తర్వాతను మొగలాయి ప్రభుత్వం వచ్చి అప్పట్లో ఆమీను ముల్కు వారు యీ దేశాన్కు అమీలుగా వచ్చి దేవాలయములు మొదలయ్ని వాటిని వృత్తిక్షేత్రాలు జర్గనియ్యక పోయినారు గన్కు అప్పట్లో ఆచ౯నాదులు పుభయ దేవస్తానముల్కు జర్గలేదు. కొండ్డవీటి శీమ సర్కారు సముతు బంద్దీలు చేశేటప్పుడు యీ గ్రామం పొంన్నూరు సముతులో దాఖలు చేశి సముతు అమీలు చౌదరు దేశపాండ్యాల పరంగ్గా అమాని మామ్లియ్యతు జర్గే యడల యీ గ్రామంలో నంన్నాపనేని వారు శ్రీ సోమేశ్వరస్వామి వారి యొక్క కాపపెత్తనం చేశే పోవూరి చౌదరి శ్రీ కేశవస్వామి వారి ఆలయాలు జీవోద్దారం చేయించ్చి శాలివాహనం ౧౫२౪ (1652 AD) శకం వర్కు పునః ప్రతిష్ఠలు చేయించ్చినారు గన్కు స్తల కరణాలయ్ని బలభద్రపాత్రుని వారు సముతు చౌదలా౯ అయ్ని అందతి౯వారు అమీలు పరంగా యిప్పించ్చిన మాన్యాలు