పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిడుబ్రోలు

53


శా ౧౦౫౬ (1134 AD) శకం లగాయతు గజపతి గణపతి గారు ప్రభుత్వం చేశే టప్పుడు వీడి దగ్గిర మహా ప్రధానులయ్ని గోపరాజు రామంన్న గారు శాలివాహనం ౧౦౬२ (1145 AD) శక మంద్దున బ్రాంహ్మణులకు గ్రామ కరణీకపు మిరాశీలు నిన౯యించ్చే టప్పుడు యీ క్రమాన్కు

౧ కట్టవారు అనే నంద్దవరీకులని సంప్రతి
౧ ఆరువేల వారు పూసపాటి సంప్రతి
౧ ప్రధములుకున పులివారి సంప్రతి
———
౩ వెరశి మూడు సంప్రతుల వారిని మిరాశి యిచ్చినారు.

అటు పిమ్మట రెడ్ల వారు ప్రభుత్వం చేశేటప్పుడు యీ గ్రామంలో విష్ణుస్తలం కట్టించ్చి నిత్య నై వేద్యాన్కు ౧ పొలముంన్ను నిత్య దీపారాధనకు పా ............న్య పొలమున్ను గ్రామంలో పండ్డిన గల్లాకు ఖ ౧ కి మానెడు చొప్పున దోశీలింన్ని నిన౯యించ్చి వుభయదేవస్తానములకు సమంగ్గానే జరిపించ్చినారు.

వడ్డెరెడ్డి కన్నా౯టక ప్రభుత్వములు శాలివాహనం ౧౫౦౦ (1578 AD) శకం వర్కు జరిగిన తర్వాతను మొగలాయి ప్రభుత్వం వచ్చె గన్కు సర్కారు సముతు బంద్దీలు చేశేటప్పుడు యీ గ్రామం పొన్నూరు సముతులో దాఖలు చేశి చౌదరు దేశపాండ్యాల పరంగ్గా అమాని మామిలియ్యతు జరిగించే యడల యీ స్వామివాల౯కు చెశ్ని నిన౯యాలు.

శ్రీ చోడేశ్వరస్వామి వారికి.

కు ౧ పొలము నిత్య నై వేద్యాన్కు
వు ౦ ౪ నిత్య దీపారాధనకు రోజు ౧ కి గం॥ ౪- చొప్పున మజ్కూరిలో వుండ్డినగొల్లాకు ఖ ౧కి.
కు ౧ దాశిరి మానెడు.

శ్రీ చన్న కేశవస్వామి వార్కి

కు ౧ నిత్య నైవేద్యాన్కు పొలము .
వు ౦ ౪ నిత్య దీపారాధనకు రోజు ౧కి మజ్కూరిలో వుండ్డిన గొల్లాకు ఖ ౧ కి
కు ౧ దాశిరి మానెడు.

యీ ప్రకారం నిన౯యం చేశినారు.

స్న ౧౧౨౨ (1712 AD) ఫసలీలో కొండవీటి శీమ మూడువంట్లు చేశి జమీందాల్ల౯ కు పంచ్చి పెట్టే యడల యీ గ్రామం సర్కారు మజుందార్లు౯ అయ్ని మానూరి వెంక్కంన్న పంత్తులు గారి వంట్టులో వచ్చి చిల్కలూరుపాడు తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు వెంక్కంన్న పంత్తులు ఆప్పాజీ పంత్తులు వెంక్కట నారాయనింగారు వెంకట కృష్ణునింగారు.