పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

నిడుబ్రోలు

కయిఫియ్యతు మౌజే నిడుబ్రోలు సంతు పొంన్నూరు సర్కారు మృతు౯

జాంన్నగరు మం॥ తాలూకే చిల్కలూరుపాడు - రాజామానూరి వెంక్కటకృష్ణారావు

మజుంద్దారు.

పూర్వంనుంచ్చి యీ గ్రామాన్కు నిడుబ్రోలు అనే పేరు వున్నది.

శాలివాహనం ౧౦౩౯ (1117 AD) శకం లగాయతు కుళోత్తుంగ్గ చోళ మహారాజు రాజ్యం చేస్తూ వుండే దినములలో కాశీలో వఖయతీశ్వరుడు నివాసంగ్గా వుండి మణికని౯కా ఘట్టానను స్నానాన్కు వెళ్ళి అక్కడ వకశాసనపు బండ్డ వుండగా పరీక్షించ్చేవరకు శీమలో వేమూరు అనే గ్రామాన్కు తూపు౯భాగాన అరకలపాడు అనేపాటి మీదను అనేకమయ్ని ధనం వున్నట్టును ఆధనాన్కు కాలభైరవుడు కావలి వుండ్డి నిరంత్తరం గంగ్గా స్నానాన్కు వెళ్ళి యేడుఘడియలకు తిరిగి వచ్చి ప్రవేశించ్చునన్నట్లుగా తాత్పర్యమాయ గనుక ఆ యతీశ్వరుడు గ్రహించ్చినవాడై కాశీనుంచ్చి బైలుదేరి వేమూరు ప్రవేశించ్చి ఆ గ్రామాన్కు తూపు౯భాగాన అర్కెలపాటి మీద ధనం వుంన్న ప్రదేశంకని అక్కడినుంచి చోళరాజు దగ్గరకు వెళ్లి ధనవృత్తాంత్రం భోధ పరిచి రాజును వెంట బెట్కుని వేమూరు ప్రవేశించ్చి బైరవుడు కాశికి వెళ్లిన సమయం కనిబెట్టి స్తలమంద్ను ఆగమంచే యించి భూమితవ్వించ్చి అన్కే మంద్ది కోమాటీలచాతను ధనం తీయించ్చి బండ్లమీదను యేసురులమీదను వంట్టెల మీదను కట్టించ్చి తలి౯ంచ్చె వరకు బైరవాగారు కాల పరిమాణం యేడు ఘడియలకు మించ్చి భైరవుడు వచ్చి ఆవహించ్చి బండ్లు కదలకుండ్డా పట్టి మీ యిద్దరిలో వఖరు బలి అయి పదాధ౯ంతోలుకో పొమ్మను మనిబై రవుడు చెప్పె గన్కు యతీశ్వరుడు రాజును చూచి నీవు యీ ధనం చాతను నిత్య శివలింగ్గ ప్రతిష్టలు చేయమనింన్ని ఆ ఫలం తనకు ధారాపొయ్య మనింన్ని శివప్రతిష్టలేనిది నీవు భోజ్నం చేయవద్దనింన్ని యీ ప్రకారంగా వచించ్ని వాడయి యతీశ్వరుడు బలి అయినాడు అటు తర్వాత చోడరాజు పధార౯ం తొవ్వించ్కుని పెరవలిలోకి వచ్చి అక్కడ శివలింగ్గ ప్రతిష్ట చేసి విష్ణుస్తలముంన్ను నిర్మాణం చేయించ్చిన వారయి తదనం త్తరం చేబ్రోలు ప్రవేశించ్చి మహాదేవప్రతిష్టచేశి ఆ స్తలం నుంచ్చి చంద్దవోలు వెళ్ళుతూ నిడుబ్రోలులో శివాలయం కట్టించ్చి శాలివాహనం ౧౦౪౨ (1120 AD) శకమంద్ను చోడేశ్వరస్వామి వారు అనే లింగ్డమూతి౯ని ప్రతిష్ఠ చేశి నిత్య నైవేద్య దీపారాధనలకు జరగ గలంద్కు కు ౧ భూమి మాన్యం యిప్పించ్చి యీ గ్రామంలో పండ్డిన గొల్లాకు ఖ ౧కి సం॥ ౦౺౦ మానెడు చొప్పున రాశికి నిత్య దీపారాధనలకు రోజు ౧ కి గం॥ ౮ చొప్పున యీ ప్రకారంగ్గా నిన౯యంచేశినారు.