పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

గ్రామ కైఫియత్తులు


నరసంన్నగారు స్న ౧౨౧౯ (1809 AD) ఫసలీ వర్కు ప్రభుత్వం చేశ్ని తర్వాతను అక్కడ కృష్ణునింగారు ప్రభుత్వం చేస్తు వుంన్నారు. యీ గ్రామంలో శా ౧౫౦౦ శకం (1578 AD) మొదలుకొని మొగలాయి అమాని ప్రభుత్వం జరిగేటప్పుడు కట్టా లింగ్గరాజు వగయిరా కరణాలు గోలకొండ్డ జమాబంద్ధికి పోయి వచ్చేటప్పుడు ఢిల్లీ పాలశంమ్మ అనే దేవత వారితో కూడా వచ్చి గ్రామంలో ప్రవేశించ్చి సాలెవాండ్లు యేడుగురు తోడికోడండ్లు చక్క పిండ్డి బట్టలు అద్దె నిమి త్తము కొడుతూ వుండగా వాండ్లకు దృష్టమయినంతలో యేడుగురు తోడికోడండ్లు మూచా౯గతులయి కొంత్తసేపటికి తెలిశి నేను ఢిల్లీ పాలశంమ్మను నేను యిక్కడ వెలశినాను పదకొండు రోజులు కొలువు అతిచయ్య వలశ్నిది అన్నింన్ని తన స్వరూపముగా యీ చక్క పిండికొట్టిన రోలు ప్రతిష్ట చెయ్యమని ఆవేశ ముఖమయి చెప్పినంత్తల్లో ఆ తదనంత్తరం ఆ సాలె స్త్రీలు చెప్పిన ప్రకారంగ్గా ఆ రోటికి ప్రాణ ప్రతిష్టచేశి పురం కట్టించ్చి పదకొండు రోజులు ఆగతి చేశినంత్తల్లో యిరువై వరహాలు ప్రయమాయ గన్కు అదే ప్రకారంగా ప్రతి సంవత్సర ముంన్ను సంవ్వత్సరం ౧కి సదరహీ ప్రకారం ప్రయం చేశి ఆ గతి జరిగిస్తూ వుంన్నారు.

తదనంత్తరం అద్దంకి నాంచ్చారంమ్మ అనే దేవత ప్రవేశించ్చి ఆమెకు పూరికి పడమటి భాగాన పురం కట్టించ్చి గ ౫ వరహాలు చొప్పున ఖచ్చు౯చేశి ఆ గతి చేస్తూ వుంన్నాము. యిది పరియంత్తం జరుగుతూ వుంన్నది. యీ గ్రామంలో వుండ్డుకున్న దేముళ్ళు స్వస్తి వాచకులు మొదలయ్ని వారికి నడిచే యినాములు

దేముళ్ళు
కు ౧ చోడేశ్వర స్వామి వార్కి
కు ౧ శ్రీ చంన్న కేశవస్వామి వారికి౦న్ని- ఆంజనేయస్వామి వారికింన్ని-
౦ ౹ ౦ పొంన్నూరు భావనారాయణస్వామి వార్కి
౦ ౺ ౦ స్వస్తి వాచకుల్కు
౦ ౦ ఽ పాత్రైవల్లి సుబ్బంన్నకు
౦ ౦ ఽ మల్లాది రామంబొట్లకు
౦ ౦ ఽ ఆరిపిరాలి పుల్లంబొట్లకు
౦ ౦ ఽ కాల౯పాటి అంక్కంమ్మకు
——————
౫ న్ని దుమాన్యాలు
౦ ౹ ౦ ఆలూరి సుంద్దర రామయ్య గార్కి
౦ ౺ ౦ ఆదిరాపుర్వు పుల్లయ్య గార్కి