పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

49

దొప్పలపూడి

కయిఫియ్యతు మౌజే దొప్పలపూడి సంతు పొన్నూరు సర్కారు మృతు౯

జాంన్నగరు తాలూకే చిల్కలూరుపాడు యీలాజె రాజమానూరి వెంక్కట

క్రిష్ణారావు.

యీ గ్రామాన్కు పూర్వం నుంచ్చి దొప్పలపూడి అనే వాడికె వుంన్నది. గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగారు ప్రభుత్వం చేశేటప్పుడు వీరి ప్రధానులయ్ని గోపరాజు రామంన్న గారు సమస్తమయ్ని నియ్యోగులకు గ్రామ కరణీకపు మిరాశీలు యిచ్చే యడల యీ దొప్పలపూడికి వశిష్ట గోతృలయ్ని మోదుకూరి భాస్కరునికి ఏక భోగంగ్గా మిరాశీ నిన౯యించ్చినారు గన్కు తదారఖ్యాతద్వంశీకులు అనుభవిస్తూ వుంన్నారు. శాలివాహనం ౧౧౬౦ (1238 AD) లగాయతు కుమార కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రభుత్వం చేశే టప్పుడు వఖ సమయమంద్దు యీ స్తలానకు వచ్చిన వారయి యీ గ్రామానుకు యీశాన్య భాగమంద్దు శివ స్తలం కట్టించ్చి మల్లేశ్వర స్వామి అనే లింగ్డమూత్తి౯ని ప్రతిష్ఠ చేసి మరింన్ని గ్రామానకు పశ్చిమ పాశ్వ౯మందు విష్ణుస్తలం కట్టించ్చి శ్రీ వేణుగోపాలస్వామి వారిని ప్రతిష్ఠ చేశి యీ స్వామి వాల౯కు నిత్య నైవేద్య దీపారాధనలకు గాను చేశిన జీవనం.

కు ౧ శ్రీ స్వామివాల౯కు నిత్య నైవేద్య దీపారాధనలకు
౦ ౺ ౦ శ్రీ మల్లేశ్వర స్వామివారికి
౦ ౺ ౦ శ్రీ వేణు గోపాలస్వామివారికి
పూ ౨ పండ్డుగ దీపారాధన మహోత్సవాలకు——
౧ శ్రీ మల్లేశ్వరస్వామి వారికి
౧ శ్రీ వేణుగోపాలస్వామి వారికి

యీ ప్రకారంగ్గా నిన౯యించ్చినారు గన్కు తదారభ్య అదే మామూలుగా జర్గుతూ వుంన్నది.

వడ్డెరెడ్డి కనా౯టక ప్రభుత్వములు శాలివాహనం ౧౫౦౦ (1578 AD) శకం వర్కు జరిగిన తరువాతను మొగలాయీ ప్రభుత్వం వచ్చె గన్కు యీ కొండ్డవీటి శీమ సంతు బంద్దీలు చేశేటప్పుడు యీ గ్రామం పొంన్నూరు సముతులో దాఖలు చేశినారు.

స్న ౧౧౨౨ ఫసలీ (1712 AD)లో కొండవీటి శీమ మూడు పంట్లు చేశి జమీదాల౯కు పంచ్చి పెట్టేయడల యీ గ్రామం సర్కారు మజుంద్దారులయ్ని మానూరి వెంక్కంన్న